అసత్యం -మాధవి కాళ్ల

Comments · 183 Views

అసత్యం -మాధవి కాళ్ల

అసత్యం

అసత్యం తీయగా నమ్మిస్తూ
మన గొంతులను కోస్తూ
సత్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తూ
సత్యం ఎంత చేదుగా ఉన్నా
నాణానికి మరో రూపం ఇతరులకు

తెలియకుండా మనల్ని

నాశనం చేయాలి అనుకుంటూ
అసత్యం ఎంతో సులువుగా అందరికీ పాకి పోతూ
అందరూ అసత్యం గురించే మాట్లాడుకుంటారు కానీ
అసలు సత్యం ఏంటో తెలుసుకోకుండా
వాళ్లని నిందిస్తూ ఉంటారు...
నిప్పులాంటి నిజం ఎప్పుడైనా

బయటికి వస్తుందని నమ్మకంతో
నిందించిన వాళ్లకు సమాధానం

చెప్పడానికి ఆధారాలు లేక
ఆధారాల కోసం అన్వేషిస్తూ
మనవాళ్ళనే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది..
ఇప్పుడున్న ప్రపంచంలో అసత్యాన్నే నమ్ముతున్నారు...
కానీ నిప్పులాంటి నిజం తెలిసినప్పుడు

జరగాల్సిన నష్టం జరిగిపోతే ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది...
సత్యం ,అసత్యం పక్కపక్కనున్న రెండిటిని

నమ్మడానికి ఒకే ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు..
అసత్యం విని ఎవరైనా నిన్ను అపార్థం చేసుకోవచ్చు కానీ
సత్యం తెలిసిన మరుక్షణం మనం బాధపడిన

ప్రయోజనం లేకుండా పోతుంది...
నిప్పులాంటి నిజం ఎప్పుడైనా బయటపడుతుంది

అది మాత్రం గుర్తు పెట్టుకో
అంతకంటే వేగంగా అసత్యం పాకిపోతుంది..

 

 

-మాధవి కాళ్ల

Comments