ఐక్యత -చైతన్య

Comments · 269 Views

ఐక్యత -చైతన్య

ఐక్యత

మన దేశం -
చాలా భాషలు ఉన్న దేశం,
చాలా మతాలు ఉన్న దేశం,
చాలా కులాలు ఉన్న దేశం,
ఎన్నో వర్గాలు,ఎన్నో తెగలు,
మనలో ఇంకెన్నో రకాల తేడాలు ఉన్నాయి.
కానీ మన అందరినీ కలిపేది ఒక్కటే,
అదే దేశం.
దేశం అంటే ఇష్టం,
దేశం అంటే ఉండే అభిమానం.
మన అందరినీ ఒకటే అని అనిపించేలా చేసేది దేశం.
మన అందరినీ ఒక తాటిపై నడిపించేది దేశం.
దేశం అంటే మట్టి కాదు,
దేశం అంటే మనుషులు.
మన అందరికీ చాలా రకాల పండుగలు ఉంటాయి,
కానీ మన అందరికీ ఉండే పండుగ జాతీయ పండుగ.
అదే మన స్వాతంత్రo దినోత్సవం.
మనకై పోరాటం చేసి,
మనకై ప్రాణాన్ని త్యాగం చేసి,
మనకై మన రేపటి కోసం,
వారి రోజును త్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ ఇదే నా సలాం.
స్వాతంత్ర్యం ఒక్కరోజు రాలేదు,
ఒక్కరూ వల్ల రాలేదు.
మనకి అది ఊరికే రాలేదు.
నువ్వు అనుభవించే స్వాతంత్రo చాలా మంది ప్రాణ త్యాగం.
ఇంత చేసిన వారికి నువ్వు ఇచ్చేది ఏంటి?
నీ దేశానికి నువ్వు చెయ్యగల విషయం ఏంటి?
నిజాయతీగా ఉండడం,
అందరూ సమానం అని నమ్మడం,
పన్ను కట్టడం.
ఈ దేశ అభ్యున్నతి కోసం పాటు పడడం.

జై హింద్

 

-చైతన్య

Comments