కప్పిపుచ్చుకోవటం -ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి 

Comments · 1309 Views

కప్పిపుచ్చుకోవటం -ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి 

కప్పిపుచ్చుకోవటం

ఎన్నో తప్పులను కప్పిపుచ్చటానికి బల్ల కింద చేతులు అంటూ తాయిలాలంటూ లంచాలు ఇచ్చి నిప్పులాంటి నిజాలను సమాధి చేస్తున్నారు .

నల్లకోటు వేసుకుని న్యాయాన్ని పలుకుతామంటూ న్యాయమూర్తులుగా చలామణి అవుతూ ఎంతోమంది అన్యాయాలను న్యాయం చేస్తూ అన్యాయం వైపు మగ్గుతూ వాళ్ళ వాక్చాతుర్యముతో నిప్పులాంటి నిజాలను కప్పిపుచ్చుతున్నారు ..

అధర్మాన్ని పెంచుతూ ఆస్తులున్న దగ్గర పదవులు ఉన్న దగ్గర నిజాలన్నీ నీరు కారుస్తూ ఉంటే ధర్మదేవత కన్నీరు కారుస్తుంది నిప్పులాంటి నిజాలను నా కళ్ళకు గంటలు కట్టి సమాధిలో పూడుస్తున్నారని..

గుట్టుగా జీవితాలను మట్టుపట్టే స్వార్థపరుల వ్యక్తిత్వాన్ని బయట పెట్టకుండా బలహీనుల నోరు నొక్కేస్తూ భయపెడుతూ నిప్పులాంటి నిజాలను భూమిలో కప్పిపెట్టే బడా బాబులు ఎందరో ...

మనలోని స్వార్ధాన్ని కప్పి పెట్టగలిగితే ఎన్నో నిప్పులాంటి నిజాలు కుంచిత స్వభావాలు తో కుళ్ళుకుపోయే వాళ్ళ జీవితాలు నిప్పులాంటి నిజాలతో కింద కప్పి పెట్టొచ్చు.

కానీ అలా చేయలేము కదా మనకన్నా ముందుగానే స్వార్థపరులు మేల్కొని నిప్పులాంటి నిజాలను కప్పి పెట్టడానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేస్తారు.

ఇది లోక రీతి కుతంత్రాలతో కూరుకుపోయి గుట్టుగా పైకి నిప్పులాంటి నిజంగా వెలుగులోకి వచ్చే కుటిల బుద్ధుల కర్మాగారం ఈ లోకం తీరీ ..

తప్పుకు తిరుగువారు ధన్యులు సుమతీ ...

 

-ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి 

Comments