పల్లవి -సి.యస్.రాంబాబు

Comments · 213 Views

పల్లవి -సి.యస్.రాంబాబు

పల్లవి

 

పల్లవి

ఆనంద నిలయా
విన్నపాలు వినవా
కోనేటి రాయా
కష్టాలు తీర్చవా
నీ నవ్వుకై మేము
తపియించినాము

చరణం
కరిగేటి కాలమూ
నిను చూపదయ్యా
వెలిగేటి దీపమూ
వేదనలు దాచేను
నీ నీడలోనే
బతుకే సాగితే
కలలన్ని నీకు
కానుకను చేసేము

చరణం
రేపున్నదో లేదో
మాకేమి ఎరుక
నీ నామమొక్కటే
అది మాకు తెలుసు
నినుచూడ రాలేక
మాకేమో బాధయ్య
నినుచూసే భాగ్యమ్ము
కలిగించవయ్య ...ఓ వెంకటేశా

-సి.యస్.రాంబాబు

Comments