కడుపునొప్పి

Comments · 145 Views

 కడుపునొప్పి -మాధవి కాళ్ల..

 కడుపునొప్పి

                               వేసవి సెలవులు అయిపోయిన తర్వాత స్కూల్లు మొదలయ్యాయి. అయితే మధ్య మధ్యలో వర్షాలు పడడంతో బద్దకంగా కృష్ణవేణి లేచి తయారయ్యి స్కూల్ కి వెళ్తుంది. 
"అయ్యో దేవుడా! ఎలాగైనా ఒక రోజు పెద్ద వర్షం వచ్చేలా , చూడు స్వామి!" అని అనుకుంటుంది.
అప్పుడే తన ఫ్రెండ్స్ కలవడంతో స్కూల్ లోపలికి వెళ్ళిపోయింది. 
ఏదో ఫంక్షన్ ఉందని కృష్ణవేణి వాళ్ళ అమ్మానాన్న ఉదయాన్నే వెళ్లిపోయారు. చెల్లి తమ్ముడిని తయారు చేసి ఈ స్కూల్ కి పంపించింది. 
తను తయారై వచ్చేలోపు వర్షం మొదలయ్యింది. అప్పుడే కృష్ణవేణి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ,
"స్కూల్ కి వెళ్తున్నావా! డుమ్మా కొడుతున్నావా!" అని అనుమానంగా అడిగింది వెంకటలక్ష్మి.
"ఎంత మాట అన్నావ్ అమ్మ! నా మీదే అనుమానమా నీకు! ఈరోజు నేను ఎలాగైనా వెళతాను?" అని పెద్ద పెద్ద మాటలు అంది కృష్ణవేణి. 
"సరే జాగ్రత్తగా వెళ్ళు" అని చెప్పింది వెంకటలక్ష్మి.
చిన్న చిన్న చినుకులుగా పడుతున్న వర్షం పెద్దగా మొదలైంది. అది చూసి 'వెళ్లాలా! వద్దా!' అని ఆలోచిస్తూ ఉండగా...
అప్పుడే టీవీలో తనకి ఇష్టమైన సినిమా మొదలైంది. ఆ సినిమా చూడ్డానికి అయినా ఈ వర్షాకాలంతో ఉండిపోవాలి అని నిర్ణయించుకొని ఇంకా బ్యాగ్ పక్కన పెట్టేసి డ్రెస్ మార్చుకుంది. 
అలా ఆ సినిమా చూస్తూ రెండు గంటల తర్వాత తనకిచ్చిన వర్క్ ని చేస్తుండగా...
ఏదో గుర్తుకొచ్చి బయటికి వెళ్ళింది కృష్ణవేణి. నాలుగు చినుకులు తన మీద పడడంతో... ఆ వర్షంలో తడాలి అని అనుకుంది.
మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వర్షంలోకి అడుగుపెట్టి చిన్న చిన్నగా పడుతున్న చినుకుల మధ్యన నిలబడి ఆ చిరుజల్లులతో ఆడుతుంది. 
'ఏంట్రా! బాబు ఈ వర్షం?' అని అనుకుంటూ వచ్చారు కృష్ణవేణి అమ్మానాన్న.
బయట వాళ్ళ మాటలు విని గబగబా ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకొని బెడ్ మీద అలా పడుకుంది.
లోపలికి వచ్చిన వెంకటలక్ష్మి ,
"ఏంటే నువ్వు స్కూల్ కి వెళ్ళలేదా!" అని అడిగింది.
"అది అమ్మ కడుపు నొప్పిగా అనిపిస్తేను అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాను , ఇంకా లేవలేదు పడుకునే ఉన్న" అని చెప్పింది కృష్ణవేణి.
"అయ్యో! కడుపునొప్పి ఉండు ఇప్పుడే కాషాయం చేసిస్తాను , తాగి పడుకో సాయంత్రం కాల తగ్గిపోతుంది" అని వెంకటలక్ష్మి చెప్పగానే...
ఛీ ఇప్పుడు ఆ కాషాయం తాగకపోతే అమ్మకి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఎలా?" అని ఆలోచిస్తూ ఉంది కృష్ణవేణి.
గంట తర్వాత వెంకటలక్ష్మి కాషాయం చేసుకొని తీసుకొచ్చి ఇచ్చింది. 
"అమ్మ వేడిగా ఉంది , నేను కాసేపయ్యాక తాగుతాను. నువ్వు వెళ్ళు" అని చెప్పింది కృష్ణవేణి.
అరగంట తర్వాత వచ్చి చూస్తే గ్లాస్ ఖాళీగా ఉంది. 'అమ్మయ్య బతికిపోయాను లేదంటేనా! ఈ చేదు కాషాయం తాగి , అమ్మకు నిజం చెప్పాల్సి వచ్చేది అని అనుకొని ఊపిరి పీల్చుకుంది.
ఇంకెప్పుడు ఇలా చేయకూడదు?' అని అనుకొని తనకున్న వర్క్ కంప్లీట్ చేస్తుంది.

-మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను

Comments