రెక్కలు తొడిగిన మనసు - ఈగ చైతన్య కుమార్

Comments · 250 Views

 రెక్కలు తొడిగిన మనసు - ఈగ చైతన్య కుమార్

 రెక్కలు తొడిగిన మనసు

ఆపితే ఆగే మనసా ఇది,
ఆశలతో సౌధం కట్టిన మనసు ఇది,
అనంతమైన ఆకాశంలా,
లోతే తెలియని సాగరంలా,
ఆపే శక్తి ఏది లేక,
మనసు నిండా కోరికతో,
సాధించాలి అని ఒకే లక్ష్యంతో సాగే పయనం.
ఈ మనస్సును ఏ గాలి ఆపలేదు,
ఏ పాత్ర దాచలేదు.
అనంతమైన ఈ విశ్వంలో,
నీ కొరకే ఒక మార్గాన్ని కనుగొంటుంది.
భంధించాలి అని చూడకుండా,
నీ లక్ష్యం ఏంటో తెలుసుకో,
అదే దిశగా సాగిపో.

 

- ఈగ చైతన్య కుమార్

Comments