నిబ్బరం --సి.యస్.రాంబాబు

Comments · 238 Views

నిబ్బరం --సి.యస్.రాంబాబు

నిబ్బరం

పొరల పొరల ఆకాశం 
పొదిగే కోడిపిట్టలా 
ఉదయంలో ఒదిగిపోతోంది 

ఓటమి ఎరుగని చక్రవర్తి
విశాల సామ్రాజ్యంలా
అబ్బురపరుస్తోంది

నిబ్బరానికి దూరమైన మనిషి 
రాత్రిని దులిపాడు
జ్ఞాపకాల ఆసరా కోసం 

అన్నీ తెలిసిన ఆకాశం 
ఏమీ తెలియనట్టుంటుంది 
మిడిమిడి జ్ఞానంతో మనిషి 
తనది జ్ఞాన నేత్రమనుకుంటాడు

-సి.యస్.రాంబాబు

Comments