మెగాస్టార్ చిరంజీవి
చిన్నప్పుడు స్కూల్ లో నాకు నా ఫ్రెండ్స్ కి చిరంజీవి గారు అంటే ఎంతో అభిమానం ఉండేది. ఆయన నటించిన సినిమాలు గురించి ప్రతి రోజు మాట్లాడుకొనే వాళ్ళం. ఆయన మమల్ని కలిసినట్టు కలలు కనే వాళ్ళం.. కొన్ని రోజులు తరువాత ఒక మాగజైన్ లో ఆయన గురించి చదివాను. అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా పేరు పొందారు. ఆయన ప్రతి పుట్టిన రోజు నాడు అభిమానాలు రక్త దానం చేసేవారు.
చిరంజీవి గారు "చారిటబుల్ ట్రస్ట్" స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి.
అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారు. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకొన్నాయి.
ఆయన సినిమాలో చెప్పే ప్రతి డైలాగ్ చాలా బాగా చెప్పేవారు. పుట్టింది పేద కుటుంబం అయిన ఉన్నంత స్థాయికి ఎదిగారు. ఆయన బ్రేక్ డ్యాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు.
ఆయన జీవితంలో రాజకీయాలలో కూడా వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని మళ్లీ ఆరు పదుల వయసు దాటిన కుర్ర హీరోలకు దీటుగా నటిస్తూ డాన్సులు వేస్తారు. అలాంటి చిరంజీవి గారికి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని దేవుడిలా కొలుస్తారు. అమలాపురం నుంచి అమెరికా వరకు ప్రతి ప్రాంతంలో కూడా మెగాస్టార్ చిరంజీవికి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు.
చిరంజీవి అంటే ఒక శిఖరం ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి అంతటి స్టార్ డం ఉన్న మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అరడజను సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ అభిమానులకు రెట్టించిన ఉత్సాహాన్ని అందిస్తున్నారు. ఆయన అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉంటారు. ఆయనలో నాకు నచ్చింది కూడా అదే.
తన తల్లికి హనుమంతుడిపై ఉన్న అమితమైన భక్తి వల్లే ఆయన పేరు చిరంజీవిగా మారింది. ఎన్నో అవార్డులు , సత్కారాలు పొందారు.
శిఖరాలు అధిరోహించడం అంటే అంత సులువైన సంగతి కాదు. తన పునాదులను తానే తొలుచుకుంటూ, తన ప్రస్థానాన్ని తానే మలచుకుంటూ ఎదిగిన వ్యక్తి చిరంజీవి.
జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక లక్ష్యం ఉండాలి.
ఆ లక్ష్యానికి చేరుకోవడానికి పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల నుంచి జారిపోకుండా విరామమనేది లేకుండా శ్రమించాలి. అలుపెరగని ఆ కృషి ఒక యజ్ఞంలా సాగాలి. ఒక తపస్సును తలపించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా , ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంలో పోరాడాలి. అవమానాలను అభివృద్ధికి మెట్లుగా భావించాలి .. అవాంతరాలను అంకితభావంతో అధిగమించాలి.
ఆయనకి తాను ఏ రూట్లో వెళ్లాలనే విషయంలో ఒక క్లారిటీ రాలేదు. వాళ్లకు భిన్నంగా తాను కనిపించాలంటే, అంతవరకూ ఎవరు చేయనివి చేయాలి అనే ఆలోచన చిరంజీవి గారికి వచ్చింది. దాంతో ఆయన తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకుని, డాన్స్ , ఫైట్లపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అలా ‘యమకింకరుడు’ , ‘అభిలాష’ సినిమాలకి ఆయన తన ఆలోచనను ఆచరణలో పెట్టడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.
"గ్యాంగ్ లీడర్" సినిమాలో ఆయన స్టైల్ , మాట్లాడే మాటలు చాలా బాగుంటుంది.
"రౌడీ అల్లుడు" సినిమాలో ఆయన కామెడీ , పాటలు అద్భుతంగా ఉంటాయి.
"ఖైదీ" సినిమాలో ఆయన చేయని తప్పులకు జైలు శిక్ష అనుభవిస్తూ వాళ్ళ అక్కని చంపిన వాళ్ళని చివరలో చంపేస్తాడు. ఎంతో గాఢంగా ప్రేమించిన అమ్మాయిని వదిలి జైలుకి వెళ్ళాడు.
ఇలా ఎన్నో సినిమాలు చెప్పిన తక్కువే. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. పండగలకు అందరూ కలిసి ఒకే దగ్గర జరుపుకుంటారు.
-మాధవి కాళ్ల