చిత్రకధ -వెంకట భానుప్రసాద్

Comments · 206 Views

చిత్రకధ -వెంకట భానుప్రసాద్

చిత్రకధ

మా అమ్మాయి పేరు హీరా. నాకు ఇద్దరు పిల్లలు. ఒక బాబు ,ఒక పాప. మా బాబు గోపీ పుట్టిన పది సంవత్సరాల తర్వాత మా పాప పుట్టింది.నిజంగా చెప్పాలంటే మా పాపపుట్టినప్పుడే ఎక్కువ సంతోషంపొందాను. దానికి కారణం ఉంది. నా చిన్నప్పుడు నాకుచెల్లెళ్ళు లేరు. ఆ లోటు చాలాకాలం వరకు ఉంది. మా పాపను ఎంతో అపురూపంగాచూసుకుంటున్నాము. 2011సంవత్సరంలో పుట్టింది మాపాప. ఇప్పుడు మా పాపకు12 సంవత్సరాలు. పాపకుశాస్త్రీయ సంగీతం,భరత నాట్యం కూడా నేర్పించాను.నేను నేర్పించాను అనేకంటేతను నేర్చుకుంది అంటే కరెక్ట్.మా అబ్బాయి చదువు పేరుతో, ఉద్యోగం పేరుతోదూరంగా ఉన్నా అమ్మాయిఉండటం వల్ల మాకు ఆ ఒంటరితనం తెలియటంలేదు. ఇళ్ళంతా సందడిగా ఉంటుంది. ఇప్పుడు ఆమెఎనిమిది తరగతి చదువుతోంది. మా అమ్మ
చనిపోయాక మా పాపలోమా అమ్మని చూసుకుంటూఉన్నాను. ఆడపిల్లకు అన్నీనేర్పించాలి అనేది నా ఉద్దేశ్యం.నా అదృష్టం బాగుండి మా హీరా కూడా రచనలు చేస్తోంది. స్కూల్లో జరిగే అన్ని తెలుగుకధల పోటీలలో పాల్గొంటోంది.ప్రధమ బహుమతి రాకపోయినా ప్రోత్సాహకబహుమతులు లభించాయి.

చాలా మంది తల్లిదండ్రులుఅమ్మాయిలుంటే కొంత బాధపడుతుంటారు. మాకు మాత్రంమా అమ్మాయే మా బలం. మాపాప ఆశయం డాక్టర్ అవ్వటం.పేదలకు వైద్య సేవలు అందించడం.అందుకోసం మేము కూడా కృషిచేస్తున్నాము. అమ్మాయిలే మన దేశానికి కీర్తి ప్రతిష్టలుతెస్తారు అని బలంగా నమ్ముతూ ఉన్నాను. మా అమ్మాయి డాక్టర్ అయ్యాకే ఈ కధ ముగుస్తుంది.

 

-వెంకట భానుప్రసాద్

Comments