సమాజంపై మార్పు - స్వరూప పేరు: పోతగాని శ్యామ్ కుమార్

Comments · 260 Views

సమాజంపై మార్పు - స్వరూప పేరు: పోతగాని శ్యామ్ కుమార్

సమాజంపై మార్పు

కూటికి కూడు నింపే రైతులను
కాటికి కానరాని లోకంలో
చేరువయ్యారే ఎందరో!!

కుర్చీలో సావాసం చేస్తూ
కులగజ్జితో కర్మఫలాల్ని
ప్రజల సొమ్ముతో ఆనందాల్ని
పొందే రాజకీయ గురువులు ఎందరో!!

దేశం దాటి దేశంలో
పన్నులు ఎగవేసి
కాలు మీద కాలు వేసుకొని
బ్రతికే దేశద్రోహులు ఎందరో!!

మానవ మృగాల చేతిలో
ముక్కుపచ్చలారని బ్రతుకులు
చిదిమేసిన అత్యాచార
బాధితులు ఎందరో!!

దొంగ బాబాల దారిదోపిడులు
దొరల పెత్తన పెత్తందారులు
లంచాలను ముక్కుకి కరిచిన
అధికారులు ఎందరో!!

కుళ్లు కుతంత్రాలకి విలువనిచ్చి
పాపపు మాటలు చెవిన పెట్టి
బంధాలను పక్కన పెట్టి
మారణ హోమాలు
చేసిన వారు ఎందరో!!

మార్పు కోసం మరు
జన్మ ఎత్తిన పాపపు
పనుల కోసం ప్రాకులాడే
వారు ఎందరో!!

అందుకే సమాజం మారదు.
మారనివ్వరు. మార్పు రావాలంటే
ఇవి కచ్చితంగా అరికట్టాలి.

- స్వరూప

పేరు: పోతగాని శ్యామ్ కుమార్

 

Comments