చిత్ర కవిత్వం
మహిళల సత్తా
చిన్నచూపు చూడకు మహిళ అని
నీ తీసుకొనే ఊపిరికి కారణం మహిళ
నీ పుట్టుక కారణం మహిళ
నీవు చేసే అకృత్యాలకు అఘాయిత్యాలకు బలయిపోతున్న మహిళ ని
భరిస్తోంది అని బలం చూపించకు
బలం తెచ్చుకొని బలి ఇవ్వటం మొదలు పెడితే భూమి మీద మానవ పుట్టుక ఉండదు అని జ్ఞప్తికి ఉంచుకో
తన కష్టాన్ని గుర్తించు మహిళని గౌరవించు
తన ప్రాణం పోసి భూమి మీదకి తెచ్చిన నిన్ను తనని కంట నీరు పెట్టిస్తే నీ ప్రాణం కి విలువ నీకు గౌరవం రెండు వుండవు
ఆడపిల్ల ని అంగటి బొమ్మలా చూడక
అమ్మలా ప్రేమించు అక్క లా అభిమానించు స్నేహితురాలిలా సంరక్షించు అలి లా ఆదరించు
ఏమి ఇచ్చిన ఋణం తీర్చుకోలేము అని గుర్తించు ఒక నీ ప్రాణం తప్ప..
ఓ మహిళ నీకు పాదాభివందనం
భరద్వాజ్
మహిళా శక్తి
కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారి భవితవ్యం కోసం ఇంటిని నందనవనం చేసి పగలు రేయి కష్టపడి ఎన్ని అడ్డంకులు అవమానాలు వచ్చిన తట్టుకుని ముందుకెళ్ళి అన్ని పాత్రలు పోషించి ఒక అక్కగా ఒక అమ్మగా ఒక భార్యగా అన్నిటికన్నా ముందు ఒక ఆడపిల్లగా గుండె ధైర్యంతో ఇంటి పనులు కాకుండా ఆటలలోను పాటల్లోనూ తన సత్తా ఏంటో చూపిస్తున్న ప్రతి మహిళకు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు