స్వేచ్ఛ స్వాతంత్ర్యం
స్వేచ్ఛని మనమే స్వయంకృతం గా వదులుకున్నాము... మానవ సృష్టి జరిగినప్పుడు లేని నిబంధన... స్వాలోచన, స్వార్ధం, అత్యాశ... ఇలాంటివి మానవులలో పెరిగి స్వేచ్ఛని నిర్బంధించి బానిసలం అయినాము... అది దేశం, రాష్ట్రము, జిల్లా, పట్టణం, గ్రామం, ఇల్లు మాత్రమే కాక మనిషి తనలో వున్న మనస్సుని కూడా మలినం చేసుకొని జీవిస్తున్న కాలం ఇది...
స్వాతంత్ర్యం వున్నా దాని కోసం పోరాడాల్సిన దుస్థితి మనం లేదా ప్రపంచం కలిపించుకుంది.. వచ్చింది. సద్వినియోగం కన్నా దుర్వినియోగం చేయటం కి అలవాటు పడిన మానవులం అందరం....
స్వేచ్ఛ అనేది పరిమితం కాదు ఒకప్పుడు అది మంచి జరిగే విధానంలో ఉంటే కానీ చెడు కోసం ఉపయోగించే స్వేచ్ఛనే మనం భరించాము.... మంచి కోసం వచ్చిన స్వేచ్ఛ ని మన ఇంట్లో (దేశం, ఇల్లు)లో చెడు, స్వార్ధ ఆలోచనల కోసం ఉపయోగిస్తూ దేశం లో ఇంట్లో స్వేచ్ఛ లేదు స్వాతంత్ర్యం లేదు అని మనకి మనమే అనుకుంటున్నాము.
మనం తీసుకున్న గోయి ని చూసి మనమే పూడ్చలేని, ఆలోచన చేయలేని దుస్థితికి ఇల్లు, దేశం వచ్చేసాయి... వాదన, వివరణ, చర్చ చేయటం కన్నా.... ముగించటం లేదా కార్యరూపంకి సిద్ధం అవ్వటం లేదా తప్పు తెలుసుకొని సరిచేసుకుంటూ ముందుకు సాగితే భవిష్యత్ తరాలు ఇంట్లో, దేశంలో సరైన మంచి స్వేచ్ఛ, ఆలోచన, నడవడికతో వుండే అవకాశం ఉంటుంది.
- సూర్యాక్షరాలు