రైతే రాజు - కిరీటి పుత్ర రామకూరి

Комментарии · 275 Просмотры

రైతే రాజు - కిరీటి పుత్ర రామకూరి

రైతే రాజు

రైతు గొప్పతనం...

మానవాళికి అన్నం పెట్టే అన్నదాత..
నిజమైన కష్టజీవి.
అలుపెరగని శ్రామికుడు.
భూతల్లి ని నమ్ముకున్న కృషివలుడు..
భరతమాత ముద్దుబిడ్డడు..
స్వార్థ మెరుగని జీవుడు..
మోసం తెలియని అమాయకుడు..
నిత్యం దళారీ వ్యవస్థ బాధితుడు..
కనీస ధరను కోల్పోతున్న కార్మికుడు..
పాడిపంటలను ఇచ్చు భగీరథుడు..
అతిగా ఆశపడని సౌమ్యుడు..
కష్టసుఖాలు తెలిసిన సాధారణ మానవుడు..
ప్రపంచం సైతం గుర్తించాల్సిన వీరుడు..
చేతులెత్తి దండం పెట్టాల్సిన మహానుభావుడు..

కావాలి గ్రామ స్వరాజ్యం..
రావాలి రైతు రాజ్యం...
అవ్వాలి రైతే రాజు..

- కిరీటి పుత్ర రామకూరి

 

Комментарии