ప్రేమలోకం -మాధవి కాళ్ల

Comments · 242 Views

ప్రేమలోకం -మాధవి కాళ్ల

ప్రేమలోకం

 

"అక్క... నేను శేఖర్ ని ప్రేమిస్తున్నాను. శేఖర్ కూడా నాతో చాలా చనువుగా ఉంటున్నాడు" అని చెప్పింది శిరీష."శేఖర్ నీతో చనువుగా ఉంటే అది నువ్వు లవ్ అని అనుకోవడం నీ తప్పు. శేఖర్ అందరితో  చనువుగా ఉంటాడు. ఒక్క నీతోనే కాదు" అని చెప్పింది ఈశ్వరి.శేఖర్ ని ప్రేమిస్తున్నాను అని శిరీష చెప్పినప్పుడు నుండి ఈశ్వరి మనసులో ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది.శేఖర్ ,ఈశ్వరి లకు ఒక్క క్షణం అస్సలు పడదు. ఎప్పుడు చూడు ఏ చిన్న, పెద్ద అని  తేడా లేకుండా వాళ్ళిద్దరి మధ్యన ప్రతి దానికి గొడవ జరుగుతూనే ఉంటుంది.

ఒకరోజు ఈశ్వరి ,శిరీషలు గుడికి వెళ్తారు.అదే గుడికి శేఖర్ తన ఫ్రెండ్స్ తో వెళ్తాడు.ఈశ్వరి , శిరీష , శేఖర్ తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు.ఈశ్వరిని వెనకాల నుండి చూసిన శేఖర్ ఈ వయ్యారి వాలు జడ వేసుకున్న అమ్మాయి ఎవరో గాని , నా మనసుని దోచేసింది. ఆ అమ్మాయి ఎవరో అని తెలుసుకోవడానికి ముందుకు వెళ్తాడు శేఖర్.కానీ ఈశ్వరి మాత్రం గుడి లోపలికి వెళ్ళిపోతుంది.

ఫ్రెండ్స్ వచ్చి"ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావ్? పద గుడి లోపలికి వెళ్దాం" అని చెప్పి శేఖర్ ని తీసుకొని గుడి లోపలికి వెళ్లిపోతారు.శిరీష శేఖర్ ని చూసి"శేఖర్ నువ్వు కూడా గుడికి వస్తావా?" అని అమాయకంగా అడిగింది."మీ అక్క లాంటివాళ్లే గుడికి వస్తున్నారు. నేను రావడంలో తప్పు లేదులే" అని వెటకారంగా చెప్పాడు శేఖర్.

శేఖర్ అన్న మాటలకి కోపంగా చూస్తుంది ఈశ్వరి.శిరీష శేఖర్ మాటలకి నవ్వుతూ"అక్క శేఖర్ మంచి జోకేసాడు కదా "అని నవ్వుతూ అడిగింది శిరీష.
శిరీష జబ్బ మీద చరుస్తూ ,"విన్నవారు ఎవరైనా దీని జోకు అంటారా?" అని కోపంగా చెప్పింది ఈశ్వరి.పూజారి గారు వచ్చి ,
"ఏంటమ్మా గుడిలో మీ గొడవేంటి?" అని అడిగారు.

"ఏం లేదు పంతులుగారు , మీరు అర్చన చేయండి" అని చెప్పింది ఈశ్వరి.శేఖర్ మనసు మొత్తం ఆ అమ్మాయి కోసమే వెతుకుతుంది. పక్క ఉన్న అమ్మాయిల అందరినీ చూస్తున్నాడు ఈశ్వరి ని తప్ప.'ఆ వాలు జడ అమ్మాయి ఎక్కడుందో? నా మనసు దోచేసింది. నన్ను తన ప్రేమలో పడేసింది అని అనుకుంటున్నాడు శేఖర్.'

కాలేజీలో యానివర్సరీ ప్రోగ్రాం జరుగుతుంది. అందులో ఈశ్వరి పాటిస్పేట్ చేస్తుంది.ఆ పాటకి తగ్గట్టుగా అచ్చ తెలుగు అమ్మాయిల రెడీ అయ్యి వచ్చింది.
ఈశ్వరి ని లంగా ఓణీలో చూసి ఆశ్చర్యం అయిపోయాడు శేఖర్. తన ముందు నుంచే వెళ్తుండగా వెనకాల ఈశ్వరి వాలు జడ చూసి అంటే ఆరోజు గుడిలో చూసింది ఈశ్వరినే అన్నమాట. నా మనసు దోచింది ఈ అమ్మాయి ఈశ్వరి యేనా అని ఒక కాసేపు ఆలోచనలో పడిపోయాడు శేఖర్.

ఎలాగైనా తెలుసుకోవాలి గుడిలో చూసిన అమ్మాయి ఈశ్వరి ఒక్కరేనా అని తెలుసుకోవడానికి ఈశ్వరి వెనకాలే వెళ్ళాడు శేఖర్."రూప ఒకసారి రా నీతో మాట్లాడాలి" అని పిలిచాడు శేఖర్.ఈశ్వరి పక్కనున్న రూప వచ్చి ,"ఏంటి శేఖర్ పిలిచావ్?" అని అడిగింది రూప."నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి" అని అడిగాడు శేఖర్."ఏంటి శేఖర్ ఆ హెల్ప్?" అని అడిగింది రూప.

మొన్న నేను ఫ్రెండ్స్ తో కలిసి గుడికి వెళ్ళాము. అక్కడ నేను ఆ గుడిలో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఈశ్వరి లాగే వాలు జడ వేసుకొని వచ్చింది.
ఆ అమ్మాయి , ఈశ్వరి ఒక్కరేనా అని నా డౌట్ దాన్ని నువ్వు క్లారిఫై చేయాలి" అని చెప్పాడు శేఖర్."అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి?" అని అడిగింది రూప.
"ఆరోజు ఈశ్వరి గుడికి వచ్చింది. కానీ ఈశ్వరిని తప్ప ,గుడిలో ఉన్న అందరి అమ్మాయిల్ని చూశాను. ఆ రోజు తను వచ్చినప్పుడు వాలు జడ వేసుకుందో లేదో నువ్వు అడగాలి" అని చెప్పాడు శేఖర్."ఇంత దానికి ఈశ్వరి ని పర్సనల్ గా అడగడం ఎందుకు? ఇప్పుడే పిలిచి అడుగుతాను ఉండు" అని చెప్పి ఈశ్వరి ని పిలిచింది రూప."ఏంటి పిలిచావ్ చెప్పు రూప?" అని అడిగింది ఈశ్వరి.

"మొన్న నువ్వు గుడికి వెళ్ళినప్పుడు వాలు జడ వేసుకున్నావా ఈశ్వరి?" అని అడిగింది రూప."అవును... వాలు జడ వేసుకునే వెళ్లాను గుడికి అని చెప్పి ఈ ప్రబుద్ధుడు కూడా గుడికి వచ్చాడు కదా" అని శేఖర్ ని చూస్తూ చెప్పింది ఈశ్వరి."థాంక్యూ యూ రూప" అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు శేఖర్.
"ఏంటి రూప? శేఖర్ నీకు థాంక్స్ చెప్తున్నాడు ఎందుకు?" అని అయోమయంగా అడిగింది ఈశ్వరి.

"మళ్ళీ శేఖర్ వచ్చి ఈ విషయం ఈశ్వరికి చెప్పకు ప్లీజ్" అని రూప చెవిలో చెప్పి వెళ్ళిపోయాడు శేఖర్."అబ్బే... ఏం లేదు ఈశ్వరి నాకు నువ్వు ఆ వాలు జడ వేస్తావేమో అని అడుగుతున్న అంతే" కొంచెం కంగారుగా చెప్పింది రూప."మరి శేఖర్ వచ్చి నీ చెవిలో ఏం చెప్పాడు?" అని అడిగింది ఈశ్వరి."అది... అది... "అని రూప సాగదీస్తుండగా"అక్క... నెక్స్ట్ పర్ఫామెన్స్ నీదే రా" ఈశ్వరికి చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది శిరీష.అమ్మా... బతికిపోయాను లేదంటే ఈశ్వరి చేతిలో నా పని అయిపోయేది అని అనుకుంది రూప.'

'అంటే నేను ఈశ్వరిని ప్రేమిస్తున్నాను. తనకి ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పాలి అని అనుకున్నాడు శేఖర్.'ఒక లెటర్ రాసి ఈశ్వరి బుక్ లో పెట్టాడు శేఖర్.ఈశ్వరి ఇంటికెళ్లిన తర్వాత బుక్ లో ఉన్న లెటర్ చూసి'ఎవరు పెట్టారు అబ్బా... అని అనుకొని' లెటర్ ఓపెన్ చేసి చదివింది.
ఈరోజు రాత్రి 12 గంటలకు వాలు జడ వేసుకొని మేడ మీదకి రా అని దాంట్లో రాసి ఉంది.
రాసిన వాళ్ల పేరు మాత్రం లేదు.

రాత్రి అన్నం తిని తర్వాత ఈశ్వరికి ఎంతసేపటికి నిద్ర పట్టట్లేదు.'ఆ లెటర్ రాసింది ఎవరో తెలుసుకోవాలంటే నేను కచ్చితంగా మేడ మీదకి వెళ్ళాలి అని అనుకొని' రెడీ అయ్యి 12 గంటలకు మేడ మీదకి వెళ్ళింది ఈశ్వరి.బాగా చీకటిగా ఉంది. ఈశ్వరి అక్కడ ఒంటరిగా ఉంది.ఎవరు వచ్చి లైట్ వేశారు. ఆ లైట్ చూసిన ఈశ్వరి కళ్ళు మూసుకుంది.

హ్యాపీ బర్త్డే టూ యు హ్యాపీ బర్త్డే టూ యు హ్యాపీ బర్త్డే టూ యు డియర్ ఈశ్వరి అని సాంగ్ పడి విషెస్ చెప్పాడు శేఖర్."ఈశ్వరి హ్యాపీ బర్త్డే కేక్ కట్ చెయ్" అని చెప్పాడు శేఖర్.కొంచం ఆశ్చర్యంగా చూసిన ఈశ్వరి కేక్ కట్ చేసి శేఖర్ కి పెట్టింది.
అలాగే శేఖర్ కూడా ఈశ్వరి కి కేక్ పెట్టాడు.

నీతో ఊహ తెలిసిన దగ్గర్నుంచి పోట్లాడుతూనే ఉన్నాను. ఏ రోజు నీ మీద ప్రేమ పుడుతుందని అనుకోలేదు.అలాంటిది ఒకరోజు నిన్ను గుడిలో చూడగానే నీ వయ్యారి వాలుజడ ని చూసి నా మనసుని దోచేసింది. నీ మీద నాకు అప్పుడే ప్రేమ పుట్టింది.నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఇంగ్లీషులో మూడు అక్షరాలు సరిపోవు.

ఈ ప్రేమ లోకంలో మనం ప్రతిరోజు విహరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు శేఖర్.నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమని గురించి నీకు చెప్పితే , నువ్వు నన్ను ఎక్కడ ఎగతాళి చేస్తావో అని చెప్పలేదు.

ఈ ప్రేమ లోకంలో మనం నిండు నూరేళ్లు విహరిస్తూ ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పింది ఈశ్వరి.ఇద్దరు ఒక కౌగిలిలో మరొకరు ఉండిపోయారు.
వాళ్ళ ఇద్దరు ప్రేమలోకంలో విహరిస్తూ ఉన్నారు.

 

-మాధవి కాళ్ల

Comments