అమ్మాయి అబద్ధపు జీవితం - భవ్యచారు

Comments · 176 Views

అమ్మాయి అబద్ధపు జీవితం - భవ్యచారు

అమ్మాయి అబద్ధపు జీవితం

ఫేస్బుక్ లో స్క్రోల్ చేస్తుంటే ఒక అందమైన అమ్మాయి ఫోటో కనిపించింది వెంటనే అది ఈ అమ్మాయి చాలా బాగుంది అని అనుకుంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను. నేను రిక్వెస్ట్ పెట్టడం ఆలస్యం వెంటనే తను యాక్సెప్ట్ చేసింది.

ఆహా ఏమి నా భాగ్యము ఇన్నాళ్లకు ఒక అందమైన అమ్మాయితో మాట్లాడబోతున్నాను అనే నా ఉత్సాహం ఉరకలు వేస్తూ హాయ్ అని మెసేజ్ పెట్టాను తను వెంటనే హాయ్ అంటూ మెసేజ్ రిప్లై ఇచ్చింది. మీరు ఎక్కడ ఉంటారు అంటూ అడిగాను నేను బెంగళూరులో ఉంటాను అంటూ చెప్పింది. మీరు ఎక్కడ ఉంటారు అని అడగడంతో నేను హైదరాబాదులో ఉంటాను అని ఆమె అడగకపోయినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను నా జీవితం అంటూ నా వివరాలన్నీ వెంటనే చెప్పేశాను.

నా విషయాలన్నీ చెప్పాను కదా మరి మీ విషయాలు చెప్పరా అంటూ అడిగాను. అప్పుడు తను మాది చాలా పెద్ద కుటుంబం మేము చాలా ఉన్న వాళ్ళం మా డాడీ ఐపీఎస్ ఆఫీసర్ మా మమ్మీ ప్రొఫెసర్ మా అన్నయ్య యూఎస్ లో ఉంటాడు ఇక అక్క కూడా పెళ్లి చేసుకుని లండన్లో స్థిరపడిపోయింది నేను ఒక్కదాన్నే ఇక్కడ మిగిలాను నేను డాక్టర్ చదువుతున్నాను అంటూ చెప్పింది.

వావ్ మంచి ఫ్యామిలీ అందరూ చదువుకున్న వాళ్లే సంస్కారం గలవాళ్లే చేసుకుంటే ఇలాంటి పిల్లనే చేసుకోవాలి అని అనుకుని వెంటనే మీ పిక్ పెడతారా అంటూ అడిగాను. హా దానికి ఏంటి పెడతాను అంటూ వెంటనే తన పిక్చర్ పెట్టింది. అమ్మాయి చాలా అందంగా ఉంది నాకు ఇంకా పెళ్లి కాకపోవడం మేము కూడా మంచిగా మంచి ఉన్నత స్థితిలోనే ఉండడంతో నేను తనకి ప్రపోజ్ చేయాలని అనుకున్నాను.

ఫిబ్రవరి 14 రోజు తనకి ప్రపోజ్ చేయాలని అనుకున్నాను ఆరోజు ప్రేమికుల రోజు కాబట్టి యాక్సెప్ట్ చేస్తుందని నమ్మకం ఉంది. దానికి ఇంకా చాలా సమయం ఉండడంతో మేమిద్దరం మాటల్లో పడ్డాము పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాటింగ్స్, మెసేజ్లు, కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. అయితే కాల్స్ లలో వీడియో కాల్స్ తప్ప మామూలుగా ఎంతసేపైనా మాట్లాడేది. ఒకసారి వీడియో కాల్ చేయమని అన్నా కూడా తను ఎప్పుడూ చేయలేదు. సరేలే అమ్మాయి కదా ప్రైవసీ కోరుకుంటుందేమో అని నేను కూడా ఏమీ అడగలేదు.

ఈలోపు నేను తన ప్రేమలో చాలా మునిగిపోయారు దాదాపు ఫ్రెండ్స్ అందర్నీ పట్టించుకోవడం మానేశాను. వర్క్ బాగా చేసి సాలరీ ఇంకా పెరిగేలా చేసుకున్నాను.. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఫిబ్రవరి రానే వచ్చింది. తను అడ్రస్ తో సహా అన్ని వివరాలు చెప్పడంతో తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని నేను తనకేం చెప్పకుండా ఫిబ్రవరి 13వ తారీకు బెంగళూరుకు వెళ్ళడానికి బస్సు ఎక్కాను..

ఎక్కువైనా జీతంతో తనకి ఒక మంచి గిఫ్ట్, ఒక పట్టు చీర వాళ్ళ అమ్మానాన్నలకి కూడా వస్తువులన్నీ కొన్నాను. అవన్నీ తీసుకొని బస్సు ఎక్కాను ఎప్పుడెప్పుడు తనని కలుస్తాను అని అనుకుంటూ విహరిస్తూ నిద్రలేని ఆ రాత్రి ఎన్నో ఊహించుకుంటూ బెంగళూరులో పొద్దుట బస్సు దిగాడు. తను చెప్పిన అడ్రస్ ప్రకారంగా అక్కడికి వెళ్లాను. అలా వెళ్తున్న సమయంలో ఆటోలో వెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది. సంధులు గొందులుగా చిన్న చిన్న ఇళ్ల మధ్యలో ఆటో వెళ్లడం కుదరదు సార్ అని అతను కన్నడలో చెప్పడంతో పర్లేదు అనుకుంటూ బ్యాగ్ తీసుకొని నడవడం మొదలు పెట్టాను.

అక్కడ అంతా మురికి కాలువలు ఇల్లు అక్కడే పక్కనే పారుతున్న మురుగు కాలువ, వాటిపై వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు, పక్కనే చిన్న హోటల్ ముందు అప్పటికే వండి అక్కడ కుప్పలుగా పెట్టిన బజ్జీలను అక్కడి పిల్లలు డబ్బులు ఇచ్చి ఒక్కొక్కటి తింటూ సగం చిరిగిన బట్టలతో కనిపించారు. ఇదేంటి ఈ అమ్మాయి నాకు కావాలని తప్పుడు అడ్రస్ ఇచ్చిందా ఏమిటి అని అనుకుంటూ అలాగే ముందుకు సాగాను అడ్రస్ ఒకసారి ఫోన్ లో చూసుకున్నాను కరెక్ట్ గానే వెళ్తున్నాను అని అనిపించింది.

నేను వెళ్ళిన అడ్రస్ ప్రకారం ఒక ఇంటి ముందు ఆగాను ఇదే ఇల్లు అని ఆ ఇంటి వైపు ఒకసారి చూశాను ముందు చిన్న తలుపు పైన రేకులతో చుట్టూ గుడ్డలు కట్టి ఒక రేకుల షెడ్డు లాగా చిన్నగా ఉంది. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటి ఇలాంటి ఇంట్లో అమ్మాయి ఉంటుందా తల్లి ప్రొఫెసర్ అని చెప్పింది తండ్రి ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పింది తను డాక్టర్ చదువుకుంటా అన్నది మేము చాలా రిచ్ అని చెప్పింది ఇలాంటి ఇంట్లో ఉంటుందా తను అని అనుకుంటూ మెల్లగా ఆ తలుపును తట్టాను.

తలుపు తట్టగానే ఎవరు అంటూ లోపల్నుంచి ఒక సన్నని గొంతు వినిపించింది నేను మళ్లీ సమాధానంగా తలుపు కొట్టాను. ఎవరూ అనుకుంటూ ఒక ఆమె వచ్చి తలుపు తీసింది. ఆ అమ్మాయి నల్లగా పళ్ళు ఎత్తుగా భారీ శరీరంతో కాకుండా ఎముకల గూడులా ఉంది. నన్ను అలా తను చూడగానే మీరు మీరు అంటూ నసుగుతూ ఏమీ లేదు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఇలా గడపాలని వచ్చాను అంటూ చెప్పబోతుండగా ఎవరే వచ్చింది కూలికి రమ్మని పిలవడానికి ఎవరైనా వచ్చారా అంటూ లోపలి నుంచి ఆమె తల్లి అనుకుంటా బయటకు వచ్చింది కొంగుతో చేతులు తూర్చుకుంటూ....

అదంతా చూసిన నేను ఇంకేమీ మాట్లాడలేక నా చేతిలో ఉన్న కవర్ ఆ అమ్మాయి చేతికిచ్చి వెనక్కి తిరిగాను. కానీ ఆ అమ్మాయి నన్ను పిలిచి ఇవి ఏవి నాకొద్దు మీరే తీసుకువెళ్లండి. నాకు ఆశలు కోరికలు ఉంటాయి కాబట్టి అవి నెరవేరే క్రమంలో మీకు అబద్ధం చెప్పాను కానీ ఇప్పుడు నేను సిగ్గు పడుతున్నాను. ఇదే నా జీవితం నేనేమీ ఇలాగే ఉంటాము నేను చెప్పినవన్నీ అబద్ధాలే అందుకు నన్ను క్షమించండి కానీ జాలిపడి మీరు ఇచ్చే ఈ వస్తువులు నాకు అవసరం లేదు అని నా బ్యాగ్ నా చేతికి ఇచ్చింది.

ఇంత అబద్ధం చెప్పినా భయపడకుండా ఆ అమ్మాయి నిజం చెప్పడం నన్ను ఆశ్చర్యచెక్కితున్ని చేసింది. నిజమే పేదరికంలో పుట్టినంత మాత్రాన ఆశలు కోరికలు ఎవరికైనా ఉంటాయి కనీసం ఆ ఊహల్లో అయినా వాళ్ళు సంతోషం వెతుక్కుంటారు కదా అని అనుకుంటూ నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి మరలాను.

************

ఆరు నెలల తర్వాత మా పెళ్లి అంగరంగ వైభవంగా మా ఇంట్లోనే జరిగింది. సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి మా జీవితంలోకి వచ్చింది. ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఆమె పేదరాలైనా, నాకు అబద్దాలు చెప్పినా ఆమె జీవితం అబద్ధం అయినా ఆమె మంచితనం ఆమె ఆత్మాభిమానం నన్ను కట్టిపడేసాయి ఉన్న విషయం అంతా నా తల్లిదండ్రులకు చెప్పాను.

పేదరాలైతే ఏంటి గుణవంతురాలే కదా అంటూ నా తల్లిదండ్రులు కూడా నా పెళ్ళికి ఆమోదముద్ర వేశారు. అందువల్లే నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను.. ఆ అమ్మాయి వచ్చాక తనని నేను డాక్టర్ని డాక్టర్ కోర్స్ చదవమని ప్రోత్సహించాను దాంతో తను చదువుకుంది. ఇప్పుడు తను డాక్టర్ తన కల నెరవేరినందుకు నెరవేర్చినందుకు ఆమె నాకు ఎంతో రుణపడి ఉన్నాను అంటుంది కానీ ఇంత మంచి మనసు గల అమ్మాయిని ఆ దేవుడు నాకు ప్రసాదించినందుకు నేను కూడా చాలా గర్వపడుతున్నాను ఇంతకీ అమ్మాయి పేరు నా పేరు చెప్పలేదు కదూ, శ్రీమతి సుస్మిత స్వరాజ్.

జీవితంలో చాలామంది అబద్ధాలు ఆడుతూనే ఉంటారు కానీ ఆ అబద్దాల వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది ఆ అమ్మాయి నిజంగా డాక్టర్ కావాలనుకుంది తన తల్లిదండ్రులు ఐపీఎస్ ప్రొఫెసర్ లాగా ఉంటే బాగుండు అని అనుకుంది కానీ తన అదృష్టం బాగా లేక పేదరికంలో మగ్గాల్సి వచ్చి తన జీవితం అక్కడే ఆగిపోతుందని అనుకుంది ఊహల్లోనైనా తన భావాలను ప్రకటించాలనుకుని స్వరాజ్ తో తను గొప్ప అని చెప్పుకుంది.

అలా చెప్పుకోవడం వల్ల మనకు మంచే జరిగింది కానీ అందరి జీవితాలు ఇలాగే ఉండవు కొందరు అబద్ధపు జీవితాలతో మోసపోతే మరికొందరు చనిపోతారు. ఇప్పుడు ఇక్కడ స్వరాజ్ ఆ అమ్మాయిని చూసి భగ్న ప్రేమికుడు లాగా మారి ప్రాణాలు తీసుకోవచ్చు కానీ అతను చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఉన్నంత భావాలు కలవాడు కాబట్టి ఆమెను అర్థం చేసుకొని ఆమె కోరికను తీర్చగలిగాడు. ఇక్కడ నీతి ఏంటంటే అమ్మాయిలు అయినా అబ్బాయిలైనా స్వరాజ్ లా ఉండరు అనేది గ్రహిస్తే మంచిది.

- భవ్యచారు

Comments