ఓ తెలుగింటి ఇల్లాలు

Comments · 222 Views

ఓ తెలుగింటి ఇల్లాలు,-మాధవి కాళ్ల

ఓ తెలుగింటి ఇల్లాలు

ఓ తెలుగు ఇంటి ఇల్లాలు
ఆ ఎర్ర చీర కట్టుకొని మహాలక్ష్మి లా కనిపిస్తూ
అందరి అవసరాలను తీరుస్తూ
ఎవరికి ఏం కావాలో నెరవేరుస్తూ
నీ చేతులు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాయి..
అయినా సరే అలసట అనుకోవు
అందరితో చిరునవ్వు చిందిస్తూ నవ్వుతూ
మాట్లాడుతూ అందరితో కలిసి పోతావు
ఓ ఇంటి ఇల్లాల నీకున్న బాధ్యతల్ని నెరవేరుస్తూ
నీకేం కావాలో నువ్వు ఆలోచించుకోకుండా
అందరూ నావాళ్లే అని అనుకుంటూ
అందరూ భోజనాలు పూర్తి చేసిన తర్వాత పడుకున్నాక
ప్రతి రోజు రాత్రి నీళ్లు తాగడానికి ఆ చేతిలో ఉన్న
చెంబుతో నీళ్ళు పెట్టి
నువ్వు భోజనం చేసి వెళ్లి పడుకుంటావు..
తెల్లవారుజామునే కోడికూతకు లేచి
అందరూ పడుకున్న తర్వాత నువ్వు సేద తీర్చుకుంటావు..
ఓ ఇంటి ఇల్లాల లక్ష్మీదేవి లాగా చీర కట్టుకొని
అందరూ నిన్ను మెచ్చుకునే లాగా
కట్టుబొట్టుకు విలువనిస్తూ
భర్తకు అన్ని విషయాలను పంచుకుంటూ
ఎవరికి ఏది కావాలో చెప్తూ ఉంటావు..
ఓ తెలుగింటి ఇల్లాలా నీ బాధ్యతల్ని నెరవేరుస్తూ ఇంట్లో వాళ్ళ అందరిని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతావు..
నీలాగా నిన్ను అర్థం చేసుకునే వారు ఎవరూ ఉండరు...

-మాధవి కాళ్ల

Comments