ఇల్లాలు - హనుమంత

코멘트 · 208 견해

ఇల్లాలు - హనుమంత

ఇల్లాలు

ఆలిగా మొదలై అంతం వరకూ
తన సర్వస్వాన్ని పంచేది
ఇల్లే తన సర్వస్వం అనుకునేది
భర్తలో భాగమే ఇల్లాలు

అమ్మ తనానికై ఆర్భాటం
ఇదోతనానికి అంకితం
నెమలి పించమల్లే
విచ్చుకొన్న ఆశలు ఇల్లాలు

అలసిన హృదయానికి
అల్లరి చేష్టలకు
చుట్టాల అనురాగానికి
ఒదార్పు ఇల్లాలు

ప్రేమను పంచుతూ
అవసరం తీర్చుతూ
భాద్యతను మరువదు
ఆదిశక్తి గా ఇల్లాలు.

- హనుమంత

 

코멘트