రైతు - హనుమంత

Comments · 198 Views

రైతు - హనుమంత

రైతు

విత్తుట మొదలు
కోయుట వరకు...
సమయానికి వర్షం
పడక నేల దున్నక
అయినా విత్తనం కొని
వేచిచూసేనుగా....
నకిలీ విత్తనాల
దళారుల మోసాల
ప్రభుత్వ రాయితీల
స్వార్థ ప్రభుత్వాలతో
అడుగడుగునా ఇబ్బందులతో.....
ఇల్లంతా
పంటపై ఆధారపడుతు
అకాల వర్షాలకు
విపరీత కరువుకు
దగ్గరి చుట్టమై
పంట కోతతో
మార్కెట్ ధరతో
అప్పుల బిగువుతో
బందాల కొలిమిలో
పిదితుడై...
హృదయమంతా బండగా
కాయమంతా కటువుగా
జీవితమే వృధాగా
రగతమంతా ఇంకి
కన్నీరే మిగిలేనుగా..

- హనుమంత

 

Comments