అర్థనారీశ్వర తత్వం
పెళ్లి మండపం లో పంచభూతాల సాక్షిగా,
వేదమంత్రాల మధ్య ఇరు కుటుంబాలు...
ఒక్కటిగా కూడి...
ఇరు మనసులని ఒక్కటి చేసి...
ఒకరి వెంట ఒకరు ఏడడుగులు వేసి..
నీకు నేనున్నా అనే ధైర్యమిస్తూ భర్త..
నీ అడుగుజాడల్లో నేను నడుస్తాను అని భార్య...
ఒకరి వేలు మరొకరు పట్టుకుని జంటగా అగ్ని దేవుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ...
నా జీవితంలో అడుగు పెట్టే ఓ చెలీ...
నీకు మంచి, చెడు, సుఖః, దుఖాఃలలో తొడుంటా...
కష్టాలలో నీవెంట ఉంటా..
కన్నీరు రానివ్వను...
నీ జీవితంలో సంతోషాన్ని నింపుతూ నీకు తోడు నీడనై నీ వెన్నంటే నిన్ను కాచుకుని
నీకు తోడుగా ఉంటా అని ప్రమాణం చేస్తూ..
తన జీవితం లోకి ఆహ్వానిస్తూ....
నాలో నువు సగం...
అని చెప్పి ఇద్దరు ఒక్కటి అవ్వడం....
తప్పులు ఒకరికొకరు సరిదిద్దుకోవటం...
కలిసి మెలిసి సంసారం ఇద్దరు ఒక్కటిగా చేయడం...
- వనీత రెడ్డీ