దయ్యం -ఉమాదేవి ఎర్రం

التعليقات · 234 الآراء

దయ్యం -ఉమాదేవి ఎర్రం

దయ్యం

అదొక పెద్ద అపార్ట్ మెంట్ దాంట్లో ఒక 150 ఇళ్లులు ఉంటాయి..అయితే అందులో కొందరు ఓనర్లు కొందరు కిరాయి వాళ్లు ఉంటారు..దానికి ప్రసిడెంటు వెంకట్రామయ్య గారు..ఆయన కొన్ని రూల్స్ పెట్టారు ..బ్యాచిలర్స్ కి కిరాయకు ఇవ్వ వద్దని పిల్లలు క్యారిడార్లోఆడవద్దని ఆడవాళ్లు నైటీలు వేసుకుని బయటకు రావద్దని..

ఆడుకునే పిల్లలు కింద గ్రౌండ్ లోనెఆడుకోవాలని ఇలాంటివి చాలా రూల్సే పెట్టారు..వాటితో పాటు మంచి పనులే తేస్తుండె..రూల్స్ పెట్టడమే కాక తరుచుగా కిందకు వచ్చి చెక్ చేస్తుండె అందుకే పిల్లలందరికీఆయనంటె విపరీతమైన కోపం..అర్థ రాత్రుల్లు కూడా వచ్చి చెక్ చేసేవాడు..కొందరు ఓనర్లు డబ్బుల ఆశకు బ్యాచ్ లర్లకు కిరాయకు ఇచ్చారు ఆయనకు అబద్దం చెప్పి అలాంటి వాల్లకు కూడా ఆయనంటే కోపమే!!

అర్థ రాత్రి పార్టీలు చేసుకునే వాల్లు ఆ బ్యాచిలర్స్..కొందరు పిల్లలు ఆ బ్యాచిలర్స్ కలిసి వెంకట్రామయ్యగారిని కిందకు రాకుండా ప్లాన్ చేసారు..

ఒకరోజు ఆయన కిందకు దిగుతుంటె వెనుక దాక్కునిసన్నగా మద్దెల వాయించారు..ఎటు చూసినా ఎవరూ కనపడలేదు ఆయనకు వెన్నులో వణుకు పుట్టింది..ఇంకో రోజు ఆ సన్నాయితో పాటు పొగ వేసారు ఇంకొంచం భయం పెరిగింది..మరో రోజు ఒకరు దయ్యం లాంటి బట్టలు వేసుకునిమద్దెల వాయిస్తూ ఒకడుంటె పొగ పెంచుతూ ఒకడుదయ్యం ఆకారం వాడు కనపడీ పరిగెడుతూ భయపెట్టారు..

దాంతో వెంకట్రామయ్య గుండె ఆగినంత పనయిందితెల్లవారి ఆ భయానికి గుండె నొప్పితో హాస్పిటల్ లోచేరాడు..స్టంట్స్ పడ్డాయట..కానీ ఈ కోతి మూకకు ఆయన బాధ తప్పింది..
అపార్ట్ మెంటంతా ఆయన ఇళ్లుగా భావించి సేవలుచేసిన ఆయన లాంటి మనిషి అపార్ట్ మెంట్ కు మాత్రం దొరకడం లేదు..

పాపం వెంకట్రామయ్య....మద్దెల దరువుకు ఓడిపోయాడు..

-ఉమాదేవి ఎర్రం

التعليقات