పెళ్ళి చూపులు - హనుమంత

Comments · 208 Views

పెళ్ళి చూపులు - హనుమంత

పెళ్ళి చూపులు

"ఏమే సుజాత టి తీసుకునిరా"
"ఆ తెస్తున్నానండి. ఏమిటి ఈ రోజు తొందరగా వచ్చారు?"
"ఆ బ్యాగు ఇటు ఇయ్యి టైమ్ కి వస్తా" "వద్దులెండి" "ఏమిటి లోపల గుసగుసలు."
"పక్కింటి సుబ్బారావు గారికి పెళ్ళి చూపులపుడు జరిగిన సంఘటనలు అండి".
మొదటి పెళ్ళి చూపులపుడు పెళ్ళి కూతురు తన గదిలోకి తీసుకెళ్ళి బాయ్ ప్రెండ్ తో దిగిన ఫోటోలు చూపించిందట.
రెండో పెళ్లి చూపులపుడు పాటలు పాడటం వచ్చా అని అడిగితే "ఉ" అన్నదట, తన పేరు అడిగినపుడు కూడా "ఉ" అన్నదట, నీకు మాటలు రావా అని అడిగినపుడు "ఉ, ఊ" అన్నదట.
మూడో పెళ్ళి చూపులపుడు వంట చేయడం వచ్చా అని అడిగితే నవ్వుతూ వాళ్ళ అమ్మ వైపు చూస్తే ఆమె బాగా చేస్తుంది అన్నది, ఎంత వరకూ చదువు కున్నావు అని అడిగినపుడు కూడా వాళ్ళ అమ్మ వైపు చూసింది, ఆమె డిగ్రీ అన్నది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే వాళ్ళ అమ్మ వైపు చూస్తే ఆమె చేసుకుంటాను అని అన్నదంట.
నాలుగో పెళ్లి చూపులపుడు అమ్మాయిని ఏమి అడిగినా నాకు సిగ్గేస్తుంది అని అనేదట, కానీ తన బాయ్ ప్రెండ్ వచ్చి పిలవగానే సిగ్గులేకుండా వెళ్ళి పోయిందట అండి.
ఇట్టాంటివి మాత్రం బాగా తెలుస్తాయే మీకు.

అబ్బో మీరు నాకోసం చెయ్యి, కాలు కోసుకొన్నపుడు లేదా.....

- హనుమంత

 

Comments