నేనూ కార్మికురాలి నే ,భవ్యచారు

Yorumlar · 225 Görüntüler

నేనూ కార్మికురాలి నే ,భవ్యచారు

నేనూ కార్మికురాలి నే ,

 

పొద్దున్నే కోడి కూడా కుయాక ముందే లేస్తాను.కాలకృత్యాలు తీర్చుకొని పొయ్యి మీద బియ్యం పెట్టేస్తాను. మరోవైపు కూరగాయలు కోసుకుంటాను. మరోవైపు టిఫిన్ కోసం పచ్చడి తయారు చేస్తాను. ఈలోపు అన్నం అవ్వగానే ఆరబెట్టేస్తాను. కూర పక్కన ఉంచి టిఫిన్ కోసం ఇడ్లీ దోశ లాంటివి వేస్తాను మళ్ళీ ఇక్కడ కోరికలు  పెద్దవి ఒకరికి ఉల్లిపాయ దోశ కావాలి మరొకరికి గుడ్డు దోశ కావాలి మరొకరికి మామూలు దోశ కావాలి  మరొకరికి మసాలా దోశ కావాలి.

ఇక అత్తమామలు ఉంటే వారికి మెత్తని ఉప్మానం లేదంటే సగ్గుబియ్యం జావో చేయాలి. ఈలోపు పతి గారి అరుపులు ఏది ఎక్కడ పెట్టావు అంటూ, అవన్నీ అందిస్తూనే మరోవైపు బాక్సులు సర్ది పెట్టాలి. ఈలోపు పిల్లలిద్దరికీ జడలు వేసి షూ లేసులు కూడా కట్టాలి.

నాకు ఆ దోశ  వద్దు నాకు ఈ దోశ కావాలి నాకు ఆ టిఫిన్ వద్దు నాకు ఈ టిఫిన్ కావాలి అంటూ మారాళ్ళు చేసే పిల్లలకు మురిపంగా గారాబంగా గబగబా బ్రతిలాడుతూ పెట్టేసి ప్రతి గారికి కావాల్సినవన్నీ సమకూర్చి అత్తమామలకు అన్ని సర్దిపెట్టి 

ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెప్పి లేదా కాగితం మీద రాసిపెట్టి లోపు స్కూల్ బస్సు వస్తుంది. గబగబా పిల్లలని స్కూలు బస్సు ఎక్కించి, పండింట్లోకి వచ్చి ఒక్క కప్పు కాఫీ తాగే అంత లోపల శ్రీవారి అరుపులు బాక్స్ ఏదంటూ ఆయన గారి బాక్స్ ఇచ్చి పంపేసరికి నా ఆఫీసుకు టైం అవడం చూసి గబగబా కప్పు కాఫీ తాగకుండానే మధ్యలో వదిలేసి గబగబా రెడీ అయ్యి, నా బాక్స్ లో ఏం పెట్టుకుంటున్నానో తెలియకుండానే ఏదో ఒకటి కూరీ, కిలోమీటర్ ఉన్న బస్ స్టాప్ వరకు గబగబా నడుస్తూ వెళ్తుంటే ఆయన బండిమీద నా పక్కనుంచి వెళ్తారు. కానీ కనీసం బస్టాప్ లోనైనా దింపుతానని అనరు. 

ఈలోపు నిండు గర్భిణీల వచ్చిన బస్సులోకి తోసుకుంటూ ఎక్కి ఎలాగోలో ఒంటి కాలి మీద నిలబడితే రాసుకుపోసుకు తిరిగే కండక్టర్లు వెకిలి చేష్టలు చేస్తే కుర్రాళ్ళ నడుమ అన్ని అవయవాలు ఘర్షణకు లోనవుతూ ఉన్న మౌనంగా భరిస్తూ ఆఫీసుకు వెళ్తే రెండు నిమిషాలు ఆలస్యమైంది అంటూ రాత్రిళ్ళు తొందరగా పడుకోవాల్సిందే అనే బాస్ మాటలు హోలీ చూపులు తట్టుకుంటూ పని చేసుకుని, మళ్లీ తిరిగి కిలోమీటర్లు బస్ స్టాప్ వరకు నడిచి వచ్చి మళ్లీ అదే రద్దీలో ఇంటికి వచ్చేసరికి పొద్దున వదిలి వెళ్ళిన అంట్లు రారమ్మంటూ పిలుస్తూ ఉంటాయి కాసేపు నడుము వాల్చి తర్వాత పనిచేసుకుందాం అన్నా పిల్లలు వస్తారు.

హోంవర్క్ చేయించాలనే ఆలోచనతో క్షణం తీరిక లేకుండా అన్లన్నీ తోమి, మళ్లీ రాత్రి వంటకు సిద్ధం చేసి పిల్లలకు ఆయనకు నచ్చిన వంటకాలు చేస్తూ నన్ను నేను మర్చిపోతూ నా ఇష్ట ఇష్టాలన్నీ గాలికి వదిలేసి మళ్లీ తినకంచాలన్నీ కడుక్కొని వచ్చి మంచం మీద  నడుము వా లుస్తుంటే, రేపటికి టిఫిన పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ చేయలోయ్ అంటూ  శ్రీవారు ముసుగుదాన్ని అటువైపు తిరిగి పడుకుంటే మనసుతో అలసిపోయిన దేహంతో అసలు ఆలోచన అనేది లేకుండా శరీరం ఒక యంత్రంలా కనీసం యంత్రానికైనా ఒక గంట విరామం ఇస్తాము.

కానీ ఇక్కడ మాత్రం విరామం లేని శ్రామికురాలిని నేను ఎవరు గుర్తించని కార్మికురాలిని నేను. బాధ్యతలను మా బందీ అయినా శ్రమజీవిని నేను. అందుకే మహిళ బావ బంధాల మధ్య సంసార సాగరంలో చిక్కుకుపోయింది. కానీ నేను ఒక కార్మికురాలిని అనే గుర్తించే వారు ఎవరూ లేరు నాకు నేను తప్ప. 

నా ఆలోచనలన్నీ తెల్లవారితే ఏం చేయాలి అనే తప్ప నాకు ఇష్టమైన వంటకం ఏది? నాకు ఇష్టమైన కాఫీ కప్పు ప్రశాంతంగా ఒక గంట కూర్చొని తాగే నేను నాటిన పువ్వుల మధ్యలో కూర్చొని ప్రశాంతంగా ఒక కవిత రాసుకునే వీలు కూడా లేని బడుగు జీవిని నేను నా శ్రమను గుర్తించేది ఎవరు. నన్ను అర్థం చేసుకునేది ఎవరు? నేను నేను గానే కాకుండా పోయాను. 

నేనెవరో నాకు తెలియకుండానే నిర్జీవమైన యంత్రంలా బ్రతుకు లిడుస్తున్నాను.. ఈ చాకిరికి విలువ ఎంత నా జీవితమంతా , చాకిరి అని ఎవరితోనైనా అంటే నీ వాళ్ళకి నువ్వు చేస్తున్నావ్ దాన్ని చాకిరీ  అని ఎలా అనుకుంటావు అంటారు సమాజం. 
అందుకే అన్ని మూసుకొని ఆలోచనలన్నీ కట్టేసి, నిరంతర ప్రవాహం నా పయనిస్తుంది నా ఈ పయనం....

అందుకే నాకు నేనే చెప్పుకుంటున్నాను కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు... భవ్య చారు

Yorumlar