వేకప్ కాల్
జీవనవనంలో
కలుపు ఉంటుంది
తీసేందుకు అలుపు ఉంటుంది !
పచ్చదనం విస్తరించాలంటే
మనసును చదును చేయాలి
ఆశల విత్తనాలు చల్లాలి
ఆనందాల సేద్యం చేయాలి
హరివిల్లులోని ఏడురంగులను
జీవితంలో నింపాలి!
కాలంతో పరిగెత్తు పోటీపడు
నిందించే నీడవు మాత్రంకాకు
ఓపికున్నవాడిని చూసి ఓటమికూడా
పారిపోతుంది!
-సి.యస్.రాంబాబు