కోయిల పాట

Comments · 434 Views

కోయిల పాట వెంకట భానుప్రసాద్ చలసాని

కోయిల పాట

వసంత ఋతువు రాకముందే ఓ చిట్టి కోయలమ్మ కూసింది.
వసంత ఋతువు రాలేదని
ఆ పక్షి తల్లి చెప్పి చూసింది.
తల్లి ఎంత చెప్పినా ఆ చిట్టి కోయిలమ్మ వినలేదు మరి.
మాట వినని కోయిలమ్మ
గొంతెత్తి కూస్తూనే ఉంది.
ఆకాశంలో ఎగిరే ఓ గ్రద్ద
దృష్టిలో పడనే పడింది.
గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి
చిట్టి కోయిలను పట్టింది.
అది చూసిన తల్లి ఏడ్చింది.
మన చిన్నపిల్లలు కూడా
అలాగే చేస్తున్నారు కదా.
చిన్న పిల్లలు పెద్ద మాటలు
మట్లాడుతున్నారు మరి.
వారి వయస్సుకు మించిన
మాటలు మాట్లాడుతున్నారు.
ఆ మాటల పరిణామాలు వారి
మీద తప్పక పడుతున్నాయి.
అలా మాట్లాడవద్దని చెపుతూ
ఉన్నారు వారి తల్లిదండ్రులు.
వినే ఓపిక కోయిలమ్మకు లేదు.
వినాలనే శ్రద్ధ పిల్లలకు లేదు.
వసంత ఋతువు రాలేదని
కోయిలమ్మకు చెప్పేదెవరు?
తొందరపడి పాడొద్దని చెప్పే
ఆ శుభ చింతకుడు ఎవరు?

వెంకట భానుప్రసాద్ చలసాని

Comments