అందమైన ప్రేమ - భరద్వాజ్ (bj writings)

Comments · 153 Views

అందమైన ప్రేమ - భరద్వాజ్ (bj writings)

అందమైన ప్రేమ

అభినయ్ డిగ్రీ పూర్తి చేసిన గ్రాడుయేట్. అతడి తండ్రి మల్లేషు అభినయ్ తో "ఏరా! కష్టపడి ఎలాగూ డిగ్రీ పూర్తి చేశావ్, ఆ రైల్వే ఉద్యోగాలు, క్లర్క్ పోస్టులు ఏవో పడ్డాయని మన సూరి బాబాయ్ చెప్పాడు అదేదో అప్లై చేసుకోరాదూ" అన్నాడు. అభినయ్ జాబ్ అప్లైకి కావలసిన సర్టిఫికెట్స్ తోసుకొని అతని ఫ్రెండ్ తో కలసి నెట్ సెంటర్ కి వెళ్లాడు.

అభినయ్ - "ఇదుగో బాబాయ్! ఏదో ఉద్యోగాలు పడ్డాయని మా నాన్నతో అన్నావంట కదా... ఇంతకీ ఏ ఉద్యోగాలు పడ్డాయేంటి?" అని హుశారు గొంతుతో అడిగాడు.

"రైల్వే పోస్టులు పడ్డాయ్ రా అబ్బాయ్!" అని చెప్పాడు సూరి బాబాయ్.

ఇంతకీ దానికి అప్లై చేయాలంటే ఏం చదివుండాలి అని అడిగాడు అభినయ్. నువ్వు డిగ్రీ పూర్తి చేసావ్ కదా, అది చాలు అప్లై చేసేకి అని అన్నాడు సూరి బాబాయ్. కావలసిన సర్టిఫికెట్లు ఇచ్చాడు అభినయ్. సూరి బాబాయ్ అభినయ్ కి రైల్వేజాబ్ కి అప్లై చేసి అతని సర్టిఫికెట్ లు తిరిగిచ్చేశాడు.

ఎంత అయింది బాబాయ్ అని అడిగాడు అభినయ్. మనలో మనకు డబ్బులెందుకు గానీ నువ్వే ఉంచుకో అన్నాడు. అభినయ్ బాబాయ్ కి ధాంక్స్ చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్లాడు.

అభినయ్ ఇంటికి వెళ్లే సరికి అతని అత్త (రాజేశ్వరి), మామ (మణిరత్నం) లు అభినయ్ నాన్నతో మాట్లాడుతున్నారు. అప్పుడు అతని మామ అభినయ్ తో... "ఏరా! అబ్బాయ్ డిగ్రీ అయిపోయిందంట కదా ఎంత పర్సంటేజూ?" అని అడిగాడు. అభినయ్, "85% వచ్చాయ్ మామ" అని చెప్పాడు మెల్లిగా.

అప్పుడు అభినయ్ తో అతని మామ. "ఏరా! మరి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేశావా?" అని అన్నాడు. "ఇప్పుడే రైల్వే జాబ్ కి అప్లై చేసి వస్తున్నా" అని అన్నాడు అభినయ్. అప్పుడు అతని మామ ఇలా అన్నాడు "మరి నాతో పాటు మా ఊరుకొస్తావా...?నాతో కలసి నా షాపులో కార్లు రిపేరు చేయడం నేర్చుకుందువుగానీ ఏదైనా ఉద్యోగంలో చేరేవరకు నా మెకానిక్ షాపులో పని చేసుకో.... ఊరికే ఏం వద్దులే నువ్వు బాగా పని నేర్చుకున్నాక నీకు డబ్బులు ఇస్తాను, అన్యాయం ఏమీ చేయనులేరా నిన్ను నా సొంతకొడుకులా చూసుకుంటాను" అని అన్నాడు.

అభినయ్ తండ్రి కూడా ఇలా అన్నాడు "మా వాడు నీతో పాటు వస్తాడులే బావా..." అని చెప్పాడు. అభినయ్ బ్యాగులో బట్టలు సర్దుకొని తన మామ, అత్తతో కలసి వాళ్ల ఊరికి బయలుదేరారు.

అలా వారు తమ ఊరు చేరుకున్నారు. మామ మణిరత్నం "అదుగో అక్కడ కనబడుతున్న షాపే మనది" అని చూపించాడు అభినయ్ కి. "ఆ.... మామ" అని అన్నాడు అభినయ్. ఆ తర్వాత వారంతా ఇంటికి చేరుకున్నారు. ఇంటికెళ్లిన వెంటనే అభినయ్ మామ బయటినుండే గట్టిగా కేక వేశాడు ఇలా "అమ్మాయ్! అమృత ఎక్కడున్నావ్" అని అన్నాడు. అప్పుడు అమృత "ఆ...నాన్న వస్తున్నా....." అని అంటూ బయటకు వచ్చింది.

అభినయ్ ఆమెను చూడగానే మనసులో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైనట్టైంది. ఆమె చంద్రుని చల్లని కాంతి వలె చాలా అందంగా ఉంది అని అభినయ్ తన మనస్సులో అనుకుంటున్నాడు. ఇంతలో అతని మామ "ఇంతకీ వంట ఏం చేశావు తల్లీ...." అని అమృతని దగ్గరకు తీసుకోని ప్రేమగా అడిగాడు.

"వంకాయ కూర, అన్నం చేశాను నాన్నా" అని అంది. అనంతరం అందరూ ఇంట్లోకి వెళ్లారు .అతని మామ తన కూతురితో "వీడు మీ మామ కొడుకు అభినయ్ " అని చెప్పాడు. కాసేపటికి అందరూ కలసి భోజనం చేశారు. అది ఎండాకాలం కాబట్టి అభినయ్ తన మామతో పాటు మేడపైన పడుకున్నాడు.

****** తెల్లవారింది ******

ఉదయాన్నే నిద్ర లేచిన అభినయ్ తన మామ అక్కడ లేకపోవడం చూసి సాప, బొంతలు తీసుకోని కిందకు దిగుతూ మెటికల పక్కనే ఉన్న కిటీలోకి అలా చూశాడు. అక్కడ రూములో అమృత నిద్ర పోతుంటే చూసి తన మనసులో "అమృత నిద్రలో కూడా ఎంత అందంగా ఉంది" అని అనుకున్నాడు.

ఆ తరువాత ఇక స్నానం చేసి మామతో పాటు మెకానిక్ షాపుకి వెళ్లాడు అభినయ్. ఆ రోజు నుండి పని నేర్చుకోవడంలో బిజీ అయిపోయాడు అభినయ్. అయితే అలా ఒకరోజు అభినయ్ మామ భోజనానికి ఇంటికెళ్లి వచ్చాడు. ఇక నువ్వు కూడా భోజనం చేసి రమ్మని చెప్పాడు మామ అభినయ్ తో....

అభినయ్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అమృత ఒక్కత్తే ఉంది. అత్త పక్కింటోల్లతో మాటలు కలిపింది. అమృత అభినయ్ కి అన్నం వడ్డించింది. ఇక తింటుంన్నాడు. అమృత అభినయ్ ని ఇలా అడిగింది "ఇంతకీ ఏమి చదుకున్నావు నువ్వు" అని.

అభినయ్ "నేను డిగ్రీ పూర్తి చేశాను" అని అన్నాడు. ఆ తరువాత వారి మధ్య ఏ మాటలూ లేవు. ఆ తరువాత కాసేపటికి తినేసి లేచాడు అభినయ్. చేతులు కడిగి వెళ్లిపోతున్న అభినయ్ ని అమృత పిలిచి అతని ఫోన్ ఇమ్మని అడిగింది. అభినయ్ భయపడ్డాడు తన ఫోన్ని అమృత పగలుకొడుతుందేమో అని. అమృత తన నెంబర్ ని సేవ్ చేసింది అభినయ్ సెల్ లో... అమృత సెల్ తిరిగి ఇస్తూ "రాత్రికి మాట్లాడుకుందాం" అని అంది. అభినయ్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు.

రాత్రి 8:30 అవుతోంది. మణిరత్నం, అభినయ్ లు షాపు మూసి ఇంటికొచ్చారు. అభినయ్ త్వరగా తినేసి మేడపైకి ఎక్కాడు. అమృత కూడా తన రూములోకి వెళ్లిపోయింది. వాళ్ల మామ ఇంకా కిందనే ఏదో లెక్కాచారాలు చూసుకుంటున్నాడు. అభినయ్ తన ఫోన్లో అమృత ఏ పేరుతో సేవ్ చేసిందని చూస్తున్నాడు. ఇంతలో మేసేజ్ వచ్చింది వాట్సప్ లో 'హాయ్' అని.

అభినయ్ అమృతతో వాట్సప్ లో చాట్ చేస్తున్నాడు.

"హాయ్ ఏంటి మాట్లాడాలి అన్నావ్" అన్నాడు.

"ఏం లేదు" అని రిప్లై ఇచ్చింది.

"ఓకే" అని రిప్లై ఇచ్చాడు అభినయ్.

సరే " పని ఎలా నేర్చుకుంటున్నావ్ ? " అని మెసేజ్ చేసింది మళ్లీ...

"మీ నాన్న బాగానే నేర్పుతున్నాడు" అని రిప్లై ఇచ్చాడు అభినయ్.

"హలో ఏంటి మీ నాన్న అని అంటున్నావ్! మామయ్య అని అనలేవా, ఎంతైనా ఆయన మా నాన్న" అని రిప్లై చేసింది.

"ఓకే సారీ!" అని చెప్పాడు అభినయ్.

"సరే ఓకే" అని మెసేజ్ చేసింది .

ఇంతలో మామ మణిరత్నం మేడపైకి వస్తున్నాడు.

"సరే ఇక ఉంటా మామ పైకి వస్తున్నాడు" అని మెసేజ్ చేశాడు అమృతకి .

"సరే bye" అని రిప్లై చేసింది.

మామ "ఏరా నువ్వు ఇంకా పడుకోలేదా అన్నాడు" అని అన్నాడు. "ఆ...... లేదు మామ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూఉన్నా" అని చెప్పాడు అభినయ్. అనంతరం ఇద్దరూ పడుకున్నారు. అమృతకి ఆరోజు నుండి ఐటిఐ పరీక్షలు మొదలయ్యాయి. మామ మణిరత్నం రోజూ అమృతని పరీక్ష హాలువరకు దింపి వచ్చే వాడు.

ఎందుకంటే ఆ ఎక్జాం సెంటర్ వాళ్ళు ఉండే ఇంటి నుండి 8 కి.మీ. దూరంలో ఊరిబయట ఉంది. అయితే మణిరత్నం ప్రతీ సోమవారం రిపేరి సామాన్ల కోసం బెంగళూరు వెళ్లేవాడు. అలా సోమవారం రానే వచ్చింది.

ఆ ముందురోజు రాత్రి మణిరత్నం మామ అభినయ్ తో "రేపు అమృతని పరీక్షహాలువద్దకు నువ్వే దింపి రావాలి, నేను రేపు ఉదయాన్నే 1:30 కి వచ్చే బెంగళూరు బస్ కి వెళ్లాలి నువ్వే నన్ను బస్టాండువరకు బండ్లో డ్రాప్ చేయాలి" అని అన్నాడు. సరే అని బదులిచ్చాడు అభినయ్ .

ప్రొద్దున్నే 1:00 కి లేచిన మణిరత్నం మామయ్య స్నానం చేసి రెడీ అవుతున్నాడు. అభినయ్ కూడా లేచి కిందకు వచ్చి బండి స్టార్ట్ చేశాడు. అలా అభినయ్ తన మామని బస్టాండులో డ్రాప్ చేసి ఇంటికొచ్చి పడుకున్నాడు. తెల్లవారి 7:00 అయింది. అభినయ్ త్వరగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని షాపు వద్దకు వెళ్లాడు. టైం 8:00 అయింది.

అభినయ్ ఇతర పనివాళ్ళతో షాపుని చూసుకుంటుండమని చెప్పి త్వరగా ఇంటికెళ్లాడు. అత్తతో, "అత్తా! మామయ్య బెంగళూరు వెళ్లాడు అమృతని పరీక్ష హాలువద్దకు నన్నుదింపమని చెప్పి వెళ్ళాడు" అని అన్నాడు .

"ఆ తీసుకెళ్లు అభి కానీ, జాగ్రత్త బండిని స్పీడుగా నడపకు" అని అత్త బదులిచ్చింది. అభి సరేనన్నాడు. అమృత కూడా తన మనసులో చాలా ఆనందంగా ఫీలయ్యింది. బయట అభినయ్ బండి స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు. అమృత బండ్లో కూర్చుంది. అలా ఇద్దరూ బండ్లో వెల్తున్నారు. అమృత "ఏమైనా తిన్నవా అభినయ్!" అని అంది. "లేదు ఇంకా తిన్లేదు అమృత "అన్నాడు అభినయ్.

"ఏంటి ఇంకా తిన్లేదా? ఇంతసేపు అలానే ఉన్నావా?" అంది. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు అభినయ్. అప్పుడు అమృత "ఏంటి అభినయ్! మాట్లాడకుండా ఉండిపోయావ్?" అంటూ అభినయ్ భుజంమీద చేయి వేసింది. ఇంతలో పరీక్షహాలు రానే వచ్చింది. అమృత అక్కడ దిగి మళ్లీ ఇక్కడికే వచ్చి ఉండమని చెప్పి వెల్లింది.

ఇంటికి వెళ్లిపోయాడు అభినయ్. మధ్యాహ్నం 12:00 pm అవుతోంది. అభి వెంటనే బండి స్టార్ట్ చేసి పరీక్షహాలు వద్దకు వెళ్లాడు. అమృత వచ్చింది. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు బండ్లో.... దారిలో అమృత "అభి నువ్వు ఎవరినైన లవ్ చేశావా" అంది. లేదు అని చెప్పాడు అభినయ్.

"ఎందుకు అడిగావ్?" అన్నాడు అభి. అమృత "ఏం లేదు, ఉన్నారేమో అనుకున్నా.... ఎంతైనా నువ్వు నాకు ఇష్టమైన బావ కదా" అంది. అభినయ్ కి ఆమె మాటలు ఏమీ అర్థం కాలేదు. అలా రెండవరోజు కూడా ఇలానే అమృతని పరీక్షహాలుకు తసుకెళ్లి, మళ్లీ తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.

మణిరత్నం ఊరు నుండి తిరిగి ఇంటికి వచ్చాడు. సరుకు మొత్తం ఇంట్లో దింపాడు. ఇక ఆరోజు నుండి మణిరత్నం మామనే అమృతని పరీక్షహాలుకు తీసుకెళ్లి దింపి మళ్లీ తీసుకొచ్చేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయ్..... అమృత పరీక్షలు అన్నీ రాసేసింది. అలా వారి ప్రేమ బలపడసాగింది. ఈ మధ్యలో కాలం కూడా వేగంగా పరుగులు తీసింది...

అలా రైల్వే ఫలితాల రోజు రానే వచ్చింది....

రైల్వే పరీక్షల ఫలితాలు వచ్చాయి. అభి పరీక్ష పాసయ్యాడు. ఇంతలో అభి నాన్న ఫోన్ చేసాడు "ఏరా పరీక్ష పాసయ్యావంట కదా సూరి బాబాయ్ చెప్పాడు ఇక ఇంటికొచ్చేయ్ ఏదో టెస్టులుకు అటెండ్ కావాలంట కదా" అన్నాడు. అభి కి తన మామయ్య ఇంటినీ, అమృతని వదిలి ఇంటికి వెళ్ళబుద్ది కాలేదు....

అప్పుడు తన మనసులో ఏదో తెలియని బాధ. అభి వాల్ల నాన్న మణిరత్నం కి ఫోన్ చేసి "ఆ... బావా మా వాడు రైల్వే పరీక్ష పాసయ్యాడు. టెస్టులకు అటెండ్ కావాలి వాడిని ఇక ఇంటికి పంపించు బావా ఇన్నాళ్లు వాడిని మీ ఇంట్లో పెట్టుకొని పని నేర్పించినందుకు చాలా ధ్యాంక్స్, నీకు మేము చాలా ఋణపడిపోయాం కద బావా" అన్నాడు.

మణిరత్నం "అదేంలేదులే బావా ఎంతైనా వాడు నా అల్లుడు కదా... సర్లే రాత్రికే వాడిని బస్ ఎక్కిస్తాను" అని చెప్పాడు. మణిరత్నం షాపు వద్దకు వెళ్ళాడు. ఊరెళ్ళడానికి అభి బ్యాగులో తన బట్టలు సర్థుకుంటున్నాడు. అత్త బయట పక్కింటోళ్లతో యధావదిగా మాటలు పెట్టింది. అమృత "ఏంటి బావా పరీక్ష పాసయ్యావంట కదా" అని కంగ్రాట్స్ అని చెప్పింది.

అభి ఆమె కల్లలో కి చూశాడు. ఆమె కళ్ల లో నీళ్లు తిరుగుతున్నాయ్. ఎందుకు అమృత ఏడుస్తున్నావా అని అడిగాడు అభి. అప్పుడు అమృత ఏమీ మాట్లాడకుండా వచ్చి అభి ని గట్టిగా కౌగిలించుకొని, "బావా నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నా నువ్వు అంటే నాకు చచ్చేంత ఇష్టం, ఇంత సడన్ గా నువ్వు ఇంటికి వెళ్తావని అనుకోలేదు, ఇన్ని రోజులూ నీకు అర్దం అయ్యేలా నా ఫీలింగ్స్ ని నీతో చెప్పడానికి ట్రై చేశా, చాలా సార్లు నీతో ఇండైరెక్టుగా చెప్పాను. నువ్వు అర్థం చేసుకోలేదు నన్ను వదలి వెళ్ళకు బావా మన విషయం మా అమ్మానాన్నలకు ఇప్పుడే చెప్తాను" అని అంది.

అభినయ్ "వద్దు నేను జాబ్ లో చేరి మళ్లీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను వస్తాను అంత వరకు ఎవరికీ ఈ విషయం చెప్పొద్దు" అని చెప్పాడు. ఇదంతా అత్త రాజేశ్వరి కిటికీలోంచి వినింది. వారిద్దరి ప్రేమబంధాన్ని చూసిన అత్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్. అప్పుడు అత్త "ఏరా అభి బట్టలు సర్దుకున్నావా" అంటూ ఇంట్లోకి వచ్చింది ఏమీ తెలీనట్టు.

సాయంత్రం 5:00 అయ్యింది. మణిరత్నం మామ అభిని బస్ ఎక్కించాడు.

***అభి ఊరు చేరుకున్నాడు***

ఆ మరుసటి రోజు నుండి అభి రైల్వే మెడికల్ టెస్టులకు వెళ్లాడు. అన్నింటిలోనూ పాసయ్యాడు. రైల్వే ఉద్యోగానికి సెలెక్టు అయ్యాడు అభి. ఆ వారం నుండే అభి ఉద్యోగంలో చేరాడు. అమృత అభికి ఫోన్లో వాట్సప్ లో మెసేజ్లు చేస్తోంది. ఇక అభి తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలనుకున్నాడు. ఇంతలో వాళ్ల ప్రేమ విషయం అత్త (రాజేశ్వరి) ఆమె అన్న అయిన మల్లేషుతో మాట్లాడింది.

ఆమె అన్న కూడా ఒప్పుకున్నాడు. ఇంటికొచ్చిన అభి అత్తని చూసాడు. అత్త, "ఏరా బాగున్నావా!" అంది. అభి అత్తతో "అత్తా నన్ను నువ్వు ఒక విషయంలో క్షమించాలి. ఇక నేను మీతో దాచకుండా చెప్తున్నాను. నేను అమృతని నా ప్రాణం కంటె ఎక్కువగా ప్రేమిస్తున్నా, తను నా సర్వస్వం. తను లేకపోతే నేను బతకలేను. నేను తనని పెళ్లి చేసుకుంటాను, కంటికిరెప్పలా చూసుకుంటాను, దయచేసి కాదు అనే మాట మాత్రం అనవద్దు అత్తా" అని అన్నాడు అభి.

అప్పుడు అత్త "ఒరేయ్ మీ ప్రేమగురించి నాకు ముందే తెలుసు ఆ రోజు మీ ఇద్దరూ ఒకరికొకరు కౌగిలించుకొని మాట్లాడుకుంటునప్పుడే చూశా, ఆరోజు అంతా విన్నా ఇప్పడు కూడా మీ పెళ్లి గురించే మా అన్న తో మాట్లాడుతున్నా.... లోపల అమృత ఉంది వెళ్లి మాట్లాడు నీ మీద బెంగతో తను సరిగ్గా తినడం కూడా మానేసింది" అని అంది.

అమృత అభిని చూసిన వెంటనే అభిని గట్టిగా హత్తుకుంది. ఆ సమయంలో వారిద్దరి ప్రేమానురాగాలు వర్ణింపలేని విధంగా ఉంది. మంచి ముహూర్తం చూసి వారిద్దరికీ పెళ్లి చేశారు వారిరువురి కుటుంబాలవారు. అలా వారిద్దరి ప్రేమ చాలా అందంగా , అన్ని కష్టాలను అధిగమించింది. ఈ రకంగా వారి ప్రేమ సుఖాంతం అయింది.

- భరద్వాజ్ (bj writings)

 

Comments