అసలైన దేశభక్తులు...!!!
వీరులంటే....
కండలు తిరిగిన దేహంతో
మీసాలు పురిదిప్పుతు పోరాడటం కాదు
బుద్ధి బలంతో పదిమంది నేస్తాలను
చిగురింప చేసేవాడు...
కుళ్ళబొడిచిన భారతావనిని వేరెవడో
ఆంగ్లేయుని తుద ముట్టించేందుకు
స్వశక్తిగా విజయం తాలూకు విజృంభనని శంఖారావంగా పూరించేను...
కలగన్నది స్వప్నంగానే మిగిలిపోరాదని
స్వరాజ్య స్థాపనకై కదులుతు
గడపగడపన పిలుపుతో స్వేచ్ఛా
వాయువులను పీల్చాలని...
హృదయతడితో వేకువని వెన్నుదట్టి
సమభావనతో సంఘం విలువలు
నిక్కమై నిలువాలని విప్లవ జ్యోతిని
వెలిగించెను అల్లూరి సీతారామరాజు...
అచంచలమైన దేశభక్తి...
ఆయుధం పట్టని శాంతికాముకుడు
చెదరని ధృక్పథానికి దిక్సూచి...
మనస్సుల మధ్యన సమభావనకు
మార్గం చూపిన విశ్వగురువు ఠాగూర్...
సర్వమతాలకు వినయ విధేయతలను
బోధించిన జాతీయ గీతాన్ని జాతికి
అంకిత మిచ్చిన ఆదర్శప్రాయుడు...
అందుకోలేని క్రోసుల కొరువులతో
కాలిపోతున్న పేదవాడు...
నవజీవన నిర్మాణాన్ని నిర్మించుకోవాలని
విధాతగా విధి విధానాలకు
జ్ఞాన ప్రధాతగా సమశృతిని ఆలాపన
చేస్తు గీతాంజలి ఉపదేశాన్ని
మానవాళికి అందించిన అద్వితీయుడు
రవింద్రనాథ్ ఠాగూర్...
దేరంగుల భైరవ (కర్నూలు)