లాలీ జోలాలీ అమ్మా కావాలి...!!! -దేరంగుల భైరవ (కర్నూలు)

Comments · 193 Views

లాలీ జోలాలీ అమ్మా కావాలి...!!! -దేరంగుల భైరవ (కర్నూలు)

లాలీ జోలాలీ అమ్మా కావాలి...!!!


కన్నదేమో ఎవరోగాని 
అమ్మప్రేమ తెలియలేదు...
తెగిన రెక్కలతో తెలవారుతు 
నోటకరిచిన ఏలుతో పాడుకొనే జోలపాట 
లాలీ జోలాలీ అమ్మాకావాలి...

చావుకేకలు గావుకేకలు 
ఒక్కటైనా అరిచినా కనికరించని 
ఈ సమాజానికి మేము అనాధలమే...
వయస్సుకు లోకం దాసోహమేనా 
పడతుల పైనే ఎందుకు వ్యామోహం...
దారులు కాచిన ఆ తల్లిది తప్పైనా 
నేర్పని కాలం మాకు శిక్షగా మారింది...
లాలీ జోలాలీ అమ్మా కావాలి...

బరువెక్కిన బతుకును చూచే 
ప్రతివాడు సాయంకాలేడు...
కోరికలు పరిచిన తనువువో నీవు 
పరిస్థితుల ప్రభావాలు తుంచిన చీకటి 
మొగ్గవో తెలియదమ్మా ఏదారేమైనా 
మా దారికి గమ్యం తెలియదమ్మా... 
లాలీ జోలాలీ అమ్మా కావాలి...

వాలే సంధ్యలతో తల దాచుకొనే
వీధి అరుగు వద్దని తోస్తున్నది...
తీగలు తెగిన మాలవు నీవై 
ఎగిరే పతంగికి ఆధారంగా కట్టావు...
వీచే చిరుగాలి పెనుగాలైనా 
బతుకును ఏ కొమ్మలు చించునో 
తెలియని వైనం సూర్యోదమవునా...
లాలీ జోలాలీ అమ్మా కావాలి...

-దేరంగుల భైరవ (కర్నూలు)

Comments