ఆశ
కాలాలు మారతాయి
మనుషులు మారతారు
మనస్సులు మారతాయి
మాటలు మారతాయి
పలకరింపులు మారతాయి
ఇదంతా డబ్బులోకం
డబ్బుకు లోకం దాసోహం
మోసం చేయడం,వెన్నుపోటు
పక్కనే ఉంటూ తడిగుడ్డతో
గొంతు కొస్తూ వెచ్చని ఆనందం పొందడం
స్వార్ధపు లోకంలో ఎవరికి వారే యమునా తీరే
తనదాకా వస్తె కానీ తెలియదు,ఆ స్వార్ధపు మూల్యమెంతో..
కనీస సహకారం లేని కళలేందుకు
కనీస అవగాహన లేని మిత్రులెందుకు
రెండూ పడవలపై నడిచే అవసరమేందుకు
నాకేమనుకుంటే అంతా నాదే, నీకే మానుకుంటే అంతా మనదే
మనిషి మారతాడు కానీ తన తప్పును తెలుసుకోగలరు
కాలం మారుతోంది కానీ మరో తరం వస్తుంది
మనస్సులు మారతాయనే ఏదో ఆశ ఈ వానలా తళుక్కుమంటుంది..