ఎవరు బాధ్యులు
ఏమ్మా శోభ వచ్చావా నీ కోసమే అప్పటినుంచి ఎదురుచూస్తున్నాను. అంటూ శోభ బ్యాగ్ అందుకుంది తల్లి శారద.
అవునమ్మా ఈరోజు కాస్త లేట్ అయింది షాట్లు రెండుసార్లు తీశారు అందుకే లేట్ అయింది అంటూ సమాధానం ఇస్తూ తన రూమ్ లోకి వెళ్ళింది ఫ్రెష్ అప్ అవడానికి శోభ.
తను ఫ్రెష్ వచ్చేలోపు తల్లి శారద తనకి కావాల్సిన డిన్నర్ రెడీ చేసింది. అది చూసిన శోభా అదేంటమ్మా నువ్వు చేసావు పనిమనిషి రమ్య ఏమైంది అంటూ అడిగింది.
అదేలే ఆ రమ్య చేసే కూరల్లో రుచి పచి ఏది ఉండదు. అందుకే నేను ఈరోజు నీకోసం ప్రత్యేకంగా చేపల పులుసు చేశాను ఈ పులుసు అంటే నీకు చాలా ఇష్టం కదా అది కూడా నా చేత్తో చేస్తే నా కూతురు సంతృప్తిగా తింటుందని చేశానమ్మ అంది శారదా.
మామ్ చేపల పులుసు అదంటే నాకు చాలా ఇష్టం. పెట్టమ్మా అంటూ కంచం ముందు కూర్చుంటూ గబగబా వేడి వేడి అన్నం లో చాపల పులుసు వేసుకొని తిన సాగింది. అయ్యో మెల్లిగా తినమ్మ ముళ్లుంటాయి చూసుకుంటూ తిను లేకపోతే నేను తీసి పెట్టనా? అంది. పర్లేదమ్మా నేను తీసుకుంటా లే అంటూ గబగబా తింటూ చాలా ఇష్టంగా తినేసింది శోభ. మెల్లిగా శోభ పక్కన కుర్చీలో కూర్చుంటూ అమ్మ శోభ ఆ రాం ప్రసాద్ గారి సంగతి ఏం చేశావ్ అంటూ అడిగింది శారద.
ఆ మాట వినగానే తింటున్న శోభ కంచాన్ని దూరం జరిపి కోపంగా నీకెన్ని సార్లు చెప్పాలమ్మా ఇలాంటి విషయాల్లో నన్ను బలవంతం చేయొద్దని... అయినా నేను ఇలాంటి విషయాల్లో కష్టపడి పైకి వచ్చింది ఇలాంటి వాళ్ళతో ఉండడానికి కాదు. ఎవరి సహాయం లేకుండా నాకు ఇష్టమైన రంగంలో ప్రవేశించడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు కదా.. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎవరి మోసాలకు గురి కాకుండా నన్ను నేను కాపాడుకుంటూ ఇంతవరకు వచ్చానంటే అదంతా నా స్ట్రెంత్ నా ఆత్మ విశ్వాసమే కారణం. కానీ ఇప్పుడు నువ్వు నన్ను మళ్ళీ అదే మురికి కూపంలోకి వెళ్ళమంటున్నావు. నాకు ఇలాంటివి నచ్చవు అని నీకు తెలుసు కదా అయినా నన్నెందుకు ఫోర్స్ చేస్తున్నావు.
ఆ రాం ప్రసాద్ నేను ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో నన్ను వాడుకోవాలని బాగా ప్రయత్నించాడు నాకు అవకాశాలు రాకుండా చేశాడు. అయినా నేను వాడిని కాదని నా టాలెంట్ తో పైకి వచ్చాను. అన్ని విధాలుగా మంచి పోజిషన్ లో ఇప్పుడు ఉన్నాను బాగా డబ్బు సంపాదించాను ఇది చాలదా అమ్మా నీకు అంటూ అడిగింది శోభ.
దాంతో కోపంగా శారద చాలదే చాలదు. ఇంతకన్నా ఇంకెక్కువ డబ్బు కావాలి నాకు, ఇంకా బంగారం, బట్టలు, ఇంకో నాలుగు ఐదు ఇల్లు కట్టుకోవాలి. మనం ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలి, వాడిని పెళ్లి చేసుకుంటే నీకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. దాంతో పాటు డబ్బు కూడా వస్తుంది పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి. ఒకరి దగ్గరకి వెళ్లి నువ్వు అవకాశం ఇవ్వమని అడగాల్సిన అవసరం ఉండదు. అవకాశమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అదే కాక వాడికి నువ్వంటే చాలా ఇష్టం ఉంది. వాడి పెళ్ళాం చనిపోయిన తర్వాత నిన్ను తప్ప ఎవరినీ చేసుకోను అంటూ నాకు రాయబారం పంపాడు. నేను చెప్పినట్టు విని వాడిని చేసుకో తల్లి. అంది శారద.
లేదమ్మా నువ్వు చెప్పినట్టు నేను వినను వాడిని చేసుకుంటే కేవలం డబ్బు వస్తుందనే చూస్తున్నావు. తప్ప వాడుకున్న చెడు అలవాట్ల గురించి నీకు తెలియదా అమ్మ. ఇండస్ట్రీ కి ఏ అమ్మాయి వచ్చిన ముందు వాడి పక్కలోకి వెళ్ళాలి లేదంటే వాడు ఆమెను సర్వ నాశనం చేస్తాడు. అవకాశాలు రాకుండా చేసి వ్యభిచారం లోకి తోసేస్తాడు. ఈ సంగతులు ఇండస్ట్రీ లో ఉన్న అందరికీ తెలుసు.
తెలిసే నాకు అవన్నీ తెలుసు కానీ ఒక్కసారి నీకు భార్య స్థానం వచ్చాక నువ్వు వాడిని మార్చుకోవచ్చు. వాడి దగ్గర కోట్లాది రూపాయల డబ్బుంది, అదంతా నీకే వస్తుంది. నా మాట విను తల్లి చేసుకో అంది శారద.
అమ్మ నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు, కానీ వాడి వయసు నాకన్నా 20 ఏళ్లు పెద్ద... అయినా అంత కామ పిశాచి నీ నేను పెళ్లి చేసుకున్నాక మారుతాడు అనే నమ్మకం లేదు. అసలు నాకు ఆ ఆలోచన నే లేదు. ఇక డబ్బు అంటావా ఇప్పటివరకు సంపాదించింది చాలు, నీ పేరు పైన ఒక కోటి రూపాయలు ఫిక్సిడ్ చేశాను. నా వరకు నేను ఎంతో కొంత దాచుకున్నాను. అలాగే నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఇంకా నటించడం మానేస్తున్నాను అంటూ బాంబు పేల్చింది శోభ.
అది విన్న శారద షాక్ అయింది. ఎంటి నటించడం మనేస్తున్నావా అంటూ మళ్ళీ మళ్ళీ అడిగింది. అవునమ్మా నటించడం మనేస్తున్నాను, ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాను, ఇక చాలు అనిపిస్తుంది, హాయిగా పెళ్లి చేసుకొని నా భర్తతో పిల్లలతో కాపురం చేసుకుంటూ ఒక ఇంటి ఇల్లాలుగా ఉండాలని ఉంది, అందుకే మ్యాట్రి మోని లో ప్రొఫైల్ కూడా పెట్టాను నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంది శోభ.
ఒకేసారి రెండు బాంబులు పేల్చేసరికి కుర్చీలోనే కుప్ప కూలిపోయి ఎంటే నువ్వు అనే మాటలు పెళ్లంటే కాదు అంటున్నావు. సరే కానీ సినిమాలు మానేయడం ఎంటి అని షాక్ అయింది శారద. అవునమ్మా నేను మ్యాట్రిమోని లో ఆల్రెడీ నా ప్రొఫైల్ పెట్టాను. అందులో ఒకతను బాగా నచ్చాడు. మేమిద్దరం కూడా మాట్లడేసుకున్నాము. ఇప్పుడు చేసేదే నా చివరి సినిమా. పెళ్లి చేసుకొని సాధారణ ఇల్లాలి జీవితం గడపాలి అనుకుంటున్నాను. మేమిద్దరం మాకిద్దరు లా ఒక సాధారణ గృహిణీల బతకాలని ఉంది అంటూ చెప్పింది శోభ.
ఇంకా నీకు సంపాదించే వయసు చాలా ఉంది. వయసంతా అయిపోయిన తర్వాత ఏ రెండో పెళ్లి వాడిని చేసుకున్నా బాగుంటుంది కదే అంది.. లేదమ్మా నేను నిర్ణయం తీసుకున్నా నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే నా నిర్ణయానికి తిరుగు లేదని నీకు తెలుసు కదా... అయినా ఇప్పటివరకు నేను సంపాదించింది చాలు, నేను చేసుకోబోయే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మాకు ఎలాంటి సమస్యలు ఉండవు అనే నేను అనుకుంటున్నాను. లేదు నువ్వు నాశనం అయిపోతావు నన్ను కాదని నువ్వు పెళ్లి చేసుకున్నా నాశనం అవడం ఖాయం.
వాడి ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు మళ్లీ నువ్వు నటించక తప్పదు, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, అయినా ఇలాంటి వాడే నీకెలా నచ్చాడు. సంపాదించే మార్గాలు ఉన్న నువ్వు అన్నిటిని వదిలివేస్తా అని అంటున్నావు ఎప్పుడో ఒకప్పుడు బాధపడక తప్పదు. నువ్వు నాశనం అయిపోతావే నా కూతుర్ని నాకు కాకుండా చేసినవాడు బాగుపడతాడా చచ్చిపోతాడు, నాశనం అవుతాడు. అంటూ నెత్తి బాధ కుంటూ శాపనార్ధాలు పెట్ట సాగింది శారద.
ఏంటమ్మా ఏంటి మాటలు ఒక కూతురిని నువ్వు ఆశీర్వదించాలి కానీ శాపనార్దాలు పెడతావ్ ఏంటి అయినా నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, నేను అతన్నే చేసుకుంటాను ఇక సినిమాలు చేయను ఇదే ఫైనల్ అంటూ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది శోభ.
***
కొద్దిరోజుల తర్వాత శోభ, హర్షల వివాహం రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిపోయింది. కానీ తల్లి మాత్రం పెళ్ళికి రాలేదు. మీడియాకు అదే హార్ట్ టాపిక్ గా మారింది.
మీడియా వాళ్ళు సినిమా స్టార్ శోభ,హర్షల రహస్య వివాహం గురించి రాస్తూ తల్లి శోభ రాకపోవడం గురించి కూడా హైలెట్ చేశారు.
ఆ తర్వాత తల్లి శారద దగ్గరకు వెళ్లి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూలో తల్లి శారద నన్ను కాదని పెళ్లి చేసుకుంది, అది నాశనం అవుతుంది. అంటూ ఎన్నో శాపనార్థాలు పెడుతూ నాకు కడుపుకోతని మిగిల్చిన వాడు, నా కూతుర్ని నాకు దూరం చేసిన వాడు ఎన్నాళ్లు బ్రతికుంటాడో నేను చూస్తాను అంటూ సవాలు కూడా చేసింది.
అది విన్న హర్ష మీ అమ్మకు ఇష్టం లేకుండా ఎందుకు చేసుకున్నాం మనం అంటూ శోభను అడిగేసరికి అమ్మ అలాగే అంటుంది, నాలుగు రోజులు పోతే తనే మళ్లీ మన దగ్గరికి వస్తుందిలే అంటూ హర్షకు సర్ది చెప్పింది శోభ.
*********
ఈ వివాద ముగిసిన తర్వాత కొన్నాళ్లకు తల్లి శారద శోభ కి ఫోన్ చేసి నాకు కొన్ని డబ్బులు కావాలి అంటూ అడిగేసరికి అబ్బా అమ్మా నాతో మాట్లాడుతుంది అని సంతోష పడిన శోభ తల్లికి డబ్బు పంపించింది. అలా విడతలు విడతలుగా అడిగిన డబ్బు పంపిస్తూనే ఉంది శోభ. ఆ తర్వాత కొన్ని రోజులకు హర్ష, శోభ దగ్గరకి వచ్చి, హే శోభ మనం న్యూ ఇయర్ ట్రిప్ కోసం గోవాకి వెళ్తున్నాం.
ఇదిగో టికెట్స్ అంటూ తన కళ్ళ ముందు ఊపేసరికి నిజమా, హర్ష అబ్బా నీకు ఇన్ని రోజులు లీవ్ దొరకనందుకు ఎటూ వెళ్లకుండా ఉన్నాం, ఇప్పటికైనా నీకు లీవ్ దొరికింది అంటూ హగ్ చేసుకుంది శోభ హర్షను. అవును బేబీ ఒక ప్రాజెక్ట్ తొందరగా అయిపోవడం వల్ల మా బాస్ లీవ్ ఇచ్చాడు. తొందరగా వెళ్ళెసి వద్దాం రెడీ అవ్వు. అంటూ అన్నాడు హర్ష. అలా వాళ్ళు ఇద్దరూ గోవా ట్రిప్ కి వెళ్ళాలి. వీళ్ళు గోవా ట్రిప్ కి వెళ్ళిన సంగతి శారదకు తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న శారద తను చేయాల్సిన పనులు అన్నీ చకచకా చేసేసింది.
అక్కడ గోవాలో హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఆ జంట ఎంతో ఉత్సాహంగా కొత్త జీవితం వైపు ఆశలతో అడుగులు వేస్తుంటే హఠాత్తుగా హర్ష కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ సారాంశం ఏమిటంటే వెంటనే వచ్చి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అది కూడా హర్షనే చేయాలని. అది వినగానే హర్ష వెంటనే విషయాన్ని శోభ కి చెప్పి ట్రిప్ క్యాన్సల్ చేసుకుని హైదరాబాద్ కి వచ్చేశారు. హర్ష నువ్వు నీ ప్రాజెక్ట్ చేసుకో నేను రెస్ట్ తీసుకుంటాను ఏమైనా కావాలంటే చెప్పు అంటూ శోభ బెడ్రూం లోకి వెళ్లిపోయింది.
**************
హర్ష తన లాప్టాప్ తీసుకొని తన రూం లోకి వెళ్తూ గుడ్ నైట్ శోభ నువ్వేమి ఫీల్ అవ్వకు మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం అని తనని ఓదార్చి వెళ్ళిపోయాడు. బెడ్ రూం లోకి వెళ్ళిన శోభ ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ పైన కూర్చుంది ఆమెలో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి పెళ్ళయ్యి రెండు నెలలు కూడా కాలేదు తల్లి పెట్టిన శాపనార్థాలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఇటు ఓదార్చడానికి హర్ష కి కూడా నా అనేవారు ఎవరు లేరు. తను తన సొంత శక్తి తో ఎదిగి ఉద్యోగం తెచ్చుకున్నాడు చాలా మంచివాడు.
తన తల్లి అతన్ని నాశనం చేస్తానని కూతురని కూడా చూడకుండా తను సర్వ నాశనం అవ్వాలని తిట్టింది. నిజంగా తన తల్లి అన్నట్టు జరుగుతుందా? తను నాశనం అయిపోయిందా? తన భర్త ఉద్యోగం పోతుందా? తను కళలు కన్న జీవితం తనది కాకుండా పోతుందా ? అలా జరిగితే ఎలా? తన తల్లికి ఇంత డబ్బు ఆశ ఉందని ఇన్నాళ్లకు తెలిసింది. నిజంగా ఒకవేళ తనకు హర్ష పరిచయం కాకపోతే ఇంకా ముసల్దాన్ని అయ్యేవరకు తన తల్లి తనను సినిమాలో నటింప చేసేది కావొచ్చు... నిజంగా నాది ఒక బతుకేనా తన తల్లి ఇలా అంటుంది అని అస్సలు ఊహించలేదు.
ఒకవేళ నిజంగానే తన తల్లి అన్నట్టు హర్ష కి ఉద్యోగం పోతే? మళ్ళీ నేను సినిమాల్లో నటించాలా? కానీ హర్షకి అది అస్సలు ఇష్టం లేదు?. నాక్కూడా ఇష్టం లేదు. నిజంగానే హర్ష కి ఉద్యోగం పోతుందా ?ఏమో? ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం?. కానీ నావల్ల ఎవరూ ఇబ్బందులకు గురి కాకూడదు, హర్ష కు ఉద్యోగం పోతే తను భరించలేదు. అలాగే హర్ష కు ఏమైనా జరిగినా తనని ఎవరు ఏమన్నా కూడా భరించలేదు. అలా ఆలోచిస్తూనే ఉంది శోభ. సమయం గడుస్తూనే ఉంది.
********************
హర్ష ఆ రూం లో ప్రాజెక్ట్ కి సంబంధించి పని చేస్తున్నాడు. ఆ పని చేస్తూనే ఇంకో మీటింగ్ లో పాల్గొన్నాడు. పక్క రూం లో శోభ విపరీతంగా ఆలోచిస్తుంది. సరిగ్గా సమయం తెల్లవారు జామున 3 గంటలు. అప్పటివరకు ఆలోచిస్తున్న శోభ తన లాప్టాప్ తెరిచి నువ్వు ఏదైనా చేయగలవు, కానీ చేసే ధైర్యం నీకు లేదు అంటూ రాసుకొని, ల్యాప్ ట్యాప్ ను అలాగే ఉంచి బెడ్ పైకి ఎక్కి ఫ్యాన్ కు చున్నీ కట్టి ఊరి వేసుకొని చివరి సారిగా హర్షని ఒకసారి తలుచుకుంటూ సారీ హర్ష అని ఊరి వేసుకుంది. రెండు నిమిషాలు కాళ్ళు గిలగిలా కొట్టుకుని ఆగిపోయాయి. శోభ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
తెల్లారింది ఎప్పటిలా పనిమనిషి వచ్చింది. ఇల్లు అంతా తుడిచి హర్ష తలుపులను కొట్టింది. చాలా ఆలస్యంగా పడుకున్న హర్ష నిద్ర మత్తులో గది తలుపులు తెరిచాడు. సార్ అమ్మగారు ఇంకా లేవనట్టు ఉన్నారు మీరు వెళ్లి లేపండి. ఆ గది కూడా తుడిచేసి వెళ్ళిపోతాను అంది.
అదేంటి శోభ ఇప్పటిదాకా లేవక పోవడం ఏంటి రోజు ఇదివరకే లేచి తనకి కాఫీ తెచ్చి ఇచ్చేది కదా అంటూ వెళ్లి శోభ గది తలుపులు కొట్టాడు. ఎంతకూ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పనిమనిషి నీ పిలిచి శోభ గది తలుపులు తీయడం లేదు నువ్వు వెళ్లి సెక్యూరిటీ అతన్ని పిల్చుకుని రా అన్నాడు. అంతలోపు శోభ ఫోన్ కి ఫోన్ చేసాడు.శోభ బయటకు వెళ్లి ఉంటుందనే ఉద్దేశ్యం తో కానీ, శోభ ఫోన్ గదిలోనే రింగ్ అవడంతో శోభ కి ఏమైందో అనే ఆందోళనలో వుండగానే పని మనిషి సెక్యూరిటీ గార్డ్ నీ తీసుకుని వచ్చింది.
హర్ష విషయాన్ని చెప్పడంతో. ఇద్దరూ కలిసి గది తలుపులను పగులగొట్టారు. తలుపులు ఒక్కసారిగా తెర్చుకోవడం తో గదిలో ప్యాన్ కు వేలాడుతున్న శోభ శరీరాన్ని చూసిన హర్ష అలా బిగుసుకు పోయాడు. అరె నిన్న రాత్రి తనతో మాట్లాడిన శోభ ఒక్కసారిగా ఇలా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. సార్ సార్ అంటూ సెక్యూరిటీ గార్డ్ పిలిచేసరికి ఈ లోకం లోకి వచ్చిన హర్ష శోభా అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. వేళ్ళాడుతున్న శోభను పట్టుకొని కిందకు దింపాలని చూసాడు.
ఇంతలో సెక్యూరిటీ సర్ ఏం చేస్తున్నారు సార్ అంటూ తనని దూరంగా జరిపి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు రావడం విచారణ చేయడం అంత జరిగిపోయింది. విషయం తల్లికి తెలిసింది గుండెలు బాదుకుంటూ వచ్చి నీ వల్లనే నా కూతురు చనిపోయింది. నేను ఎన్నోసార్లు చెప్పాను పెళ్లి చేసుకోవద్దని అయినా చేసుకుంది.
అంతా వీడి వల్లనే అంటూ పోలీసుల ముందు హంగామా చేసింది. పోలీసులు కూడా హర్ష నే అనుమానించారు.హర్ష ను స్టేషన్ కి తీసుకెళ్ళి రకరకాలుగా ప్రశ్నించారు. హర్ష గురించి ఆఫీసులో అన్ని ఎంక్వైరీ లు చేసారు. కానీ ఎక్కడ అయినా హర్ష మంచి వాడు అనే చెప్పారు. కానీ నెగెటివ్ గా ఎవరూ చెప్పలేదు.హర్ష ఒక అనాధ తనకి ఎవరూ లేరనే తెల్సింది,దాంతో శోభకు ఎటువంటి ఇబ్బందులు లేవు ,కానీ ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ అర్ధం కాలేదు. దాంతో శోభ చావుకి కారణాలు ఏమిటి అనేది తేలియలేదు. చివరికిఎవరిని అనుమానించలేక కేసును క్లోజ్ చేశారు పోలీసులు.
ఇంతకీ శోభ చనిపోవడానికి బాధ్యులు ఎవరు? తల్లి పెట్టిన శాపనార్థాలా? లేదా అవి నిజమవుతాయని భ్రమపడిన శోభ ఆలోచనలా? భార్యను ఒంటరిగా వదిలేసిన హర్షదా? మీరేం అంటారు?
ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా రాసిన కల్పిత పేర్లతో రాసిన నిజమైన కథ.
- భవ్య చారు
ఇది నా సొంత రచనే అని హామీ ఇస్తున్నాను
కథ కొనసాగుతుంది.