యక్షిణి 2

Comments · 500 Views

యక్షిణి 2,-భరద్వాజ్

యక్షిణి 2

రైల్వే గేట్ దగ్గర ఆగి ఉన్న సుధీర్ ని అతని స్నేహితులు పలకరించారు సుధీర్ అతనికి బదులు సమాధానం ఇచ్చాడు వారి స్నేహితులను తన వద్దకు రమ్మని పిలిచాడు సుధీర్ అందరూ దగ్గరకు రాగానే యక్షిణి నీ వాళ్ళందరికీ పరిచయం చేశాడు తాము ప్రేమలో ఉన్నామని జీవితంలో స్థిర పడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు తొలిసారిగా విహారానికి వెళ్తున్నాం అని చెప్పాడు అందరూ ఇద్దరిని అభినందించారు ఇంతలో రైలు కూత పెడుతూ వచ్చింది రైలు వెళ్ళిపోగానే చెక్పోస్ట్ గేట్ తెరిచారు అందరూ వెళ్లి జీప్ ఎ క్కారు సుధీర్ కూడా తన bike స్టార్ట్ చేసాడు అందరి వాహనాలు ఒక్కసారిగా ముందుకు కదిలాయి డబుల్ రూట్l లో వేగంగా యక్షిణి కి సుధీర్ కి మంచి థ్రిల్లింగ్ అనిపించింది మెల్లగా సూర్యుడు పడమర కొండల్లోకి జారుకుంటున్నాడు మెల్లగా మబ్బులు కమ్ముకుంటున్నాయి వీరి బైక్ వెనకాల ఒక కిలోమీటర్ దూరంలో సుధీర్ స్నేహితుల జీప్ వస్తోంది వీరందరూ నల్లమల్ల అడివిలో ఉండే రిసార్ట్స్ లోకి వెళ్తున్నారు వీరితో పాటు పలు జంటలు కారులో బండ్ల మీద వస్తున్నారు కొద్ది దూరం వెళ్ళేటప్పటికి అడవి దట్టంగా కనిపించింది
యక్షిణి సుధీర్ వెళ్తూ ఉన్నారు సుధీర్ యక్షిణి నీ భయపడుతున్నావా అని అడిగాడు లేదు నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు అని సమాధానం ఇచ్చింది యక్షిణి అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తున్నారు ఒక గంటలో అడవిలో ప్రయాణించిన తరువాత ఒక చిన్న ఊరు కనపడింది దాని పక్కన రిసార్ట్ కనిపించింది
ఆ రిసార్ట్ లో చెట్టుకింద వాహనం ఆపి లగేజ్ తీసుకుని లోపలకి వెళ్లి కాటేజ్ కావాలని అడిగారు
కాటేజ్ కి సంబంధించిన వివరాలు పూర్తి అయ్యాక
వాళ్ళను ఒక వాహనం ఎక్కించుకుని వారు తీసుకున్న రూం కి తీసుకు వెళ్తారు అది ఒక బృందావనం లా ఉంది దానిలోకి మృగాలు రాకుండా ఉండేందుకు పది అడుగుల ఎత్తులో దానిని కట్టారు వారికి సహాయం చేసే వ్యక్తి లగేజ్ తీసుకుని నా వెనకాల రమ్మని వారికి చెప్పాడు
వీరు వచ్చిన మార్గంలో ఒక కుటీరం ఉంది
అది ఎక్కడానికి చెక్క మెట్లు ఉన్నాయి కాటేజ్ పైకి వెళ్లి తలుపులు తీసి లగేజ్ లోపల పెట్టాడు ఆ వ్యక్తి వెనక ఇద్దరు లోపలకి వచ్చారు చాలా బాగుంది ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపించింది వారికి లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి వారితో వచ్చిక వ్యక్తి బయలుదేరుతూ వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు రాత్రిపూట ఎవరు వచ్చి తలుపు తట్టిన తలుపు తీయకండదు అడవి అందాలు చూడటానికి అన్ని జాగ్రత్తలు చెప్పాడు అతను వెళ్ళగానే తలుపులు వేసుకున్నారు ఇద్దరు కలిసి భోజనం చేశారు అలా భోజనం చేస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు అలా మాట్లాడుతూ వేడిగా ఉన్న ప్లేట్ పట్టుకున్నాడు చేయి కాలింది అలా సరదాగా తన చేతిలో ఉన్న గరిటెతో యక్షిణి నీ కొట్టడానికి ప్రయత్నించాడు
ఇంతలో పెద్ద అరుపు వినిపించింది సుధీర్ యక్షిణి భయపడిపోయి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఉన్న చోట నిలబడిపోయారు ఆ శబ్దానికి ఒక్కరు ఉంటే కనక బెదిరి చచ్చిపోతారు .
తరువాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం

 -భరద్వాజ్

Comments