భద్రాచల మహిమ

Comments · 481 Views

భద్రాచల మహిమ భద్రాచల మహిమ భద్రాచల మహిమ

భద్రాచల మహిమ

భద్రాచలం  శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరూ తయారు చేసినది కాదు.

మరి ఇది ఎలా వచ్చిందంటే..?

భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను తెప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయార చేయిస్తున్నాడు. 

కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో,లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది. 

కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు. అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు" అని చెప్పాడు.

మరుసటి రోజు గజ ఈత గాళ్ళతో రామదాసు వెతికించాడు. కానీ కనిపించలేదు.

మళ్లీ రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది" అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది.

ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది......
ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కనుకనే భద్రాద్రి మహా పుణ్యక్షేత్రమై విలసిల్లుతుంది..... 

Comments