పండగ_పూట_పాత_మొగుడేనా.. అనే సామెత.. ఈ మాట ఇచ్చే అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించారా...
మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం కదా.. అంటే పండగ పూట కొత్త మొగుడు కావాలి అన్న అర్థం వచ్చింది.. ఇది తప్పు అని దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేశాను.. అప్పుడు నాకు దొరికింది అసలైన సామెత... నిజమైన తెలుగు సాంప్రదాయ సామెత....
#పండగ_పూట_పాత_మడుగేనా పండగ_పూట_పాత_మడుగేనా ...
మడుగు అంటే వస్త్రం అని అర్థం.. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.. ఆ అర్థంలో పుట్టిన సామెత... పండగ పూట పాత బట్టలు కాదు.. కొత్త బట్టలు కట్టుకోవాలి అని...
ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు... సరైన రీతిలో నే పలుకుదాం.. పలికిద్దాం...
#పండగ_పూట_పాత_మడుగేనా