తారకరామునికి గురువు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆశీస్సులు..
Vijayawada,
9.2..70.
My Dear Mr. Rama Rao,
పద్మభూషణ సందర్భంలో నీవు నాకు పంపిన అభినందనలు చేరినవి.
నీవు "ఏకవీర'"లో కుట్టాన్ పాత్ర నటించి
నాకు కలిగించిన ఆనందము కంటే ఈ బిరుదము నా కధి కానందము కలిగించ లేదు.
నీవు తెలుగు సినీ రంగములో ధ్రువతారగా నున్నావు.
నీకిదివరకే ఉత్తరము వ్రాయ వలయు ననుకొన్నాను.
నీవు కుట్టాన్ గా పూర్వమే చిత్రములోనను ప్రకటించనంత
అభినయము ప్రకటించినావు.
చిన్నప్పుడు నేను నీకు గురువను.
అఋణమును తీర్చనావని చెప్పవలయును.
నేడు నాకు పద్మభూషణ బిరుదమువచ్చినది.
నేను కోరలేదు.
తిరస్కరించుటకు వీలు లేక పోయినది.
ఇది ఒక విషయము.
నేను నీకు చిన్నప్పుడు
గురువను.
ఇది రెండవ విషయము.
ఈ రెండు విషయములలో నాకు రెండవదియే ఎక్కువ ఇష్టంగానున్నది.
ఆశీస్సులు .
విశ్వనాథ సత్యనారాయణ