ఒహ్.. చావా...
ఒహ్... చావా....
ఇలా కూడా
వస్తావా...
మా... నవత్వం...ను
చంపేసి...
మనుషుల గుండెల్లో నుండి
మాయం చేశావా
పసి కలల్ని చిదిమేసి
వాడి పడి
పోయిన శరీరాల్లో....
జాలి లేని
నీ నాట్యం చూస్తూ...
ప్రపంచం నాకేటి
సిగ్గంటూ ఉంటే...
ఓహ్.... చావా...
ఇలా కూడా
చూస్తావా...
మృగాల్లలో మగతనం
ఎగిసి పడుతుంటే
తల్లి హృదయాలు
అటుకెక్కయా....
జన్మ నిచ్చిన
దేవుడా....
స్పందించే మనస్సు
ఇచ్చే కంటే
జంతువు లానే
ఉంచేస్తే పోలే....
ఒహ్.. చావా...
అప్పుడు
మా చావు
మేమే చస్తాము కదా...
మా...
నవ
ప్రపంచ
సృష్టిలో...
స్వార్థం లేని
మా.. నవజాతి గా
మమతాల కోవెలలో
అనురాగాల
ఆకాశ పందిరిలో
మా బ్రతుకు
మేము బ్రతుకుతాం
కదా..
ఓహ్... చావా
మధురంగా.. రా...
స్మృతులు
జగతి కిచ్చి
మమ్మల్ని
తల ఎత్తుకొని
ఆకాశంలో
సగర్వంగా
వెళ్లిపోనీ .....
-అల్లావుద్దీన్ షేక్