మనిషి -మకిలి

Comments · 296 Views

మనిషి -మకిలి -సి.యస్.రాంబాబు

మనిషి -మకిలి

 

మనిషి మెదడు పొరల్లా 
ఆకాశం పొరలు అర్థం కావు 
ఆకాశం మాట్లాడదు 
సంకేతాలిస్తుంది
మాట్లాడే మనిషి తప్పుడు సంకేతాలిస్తాడు 
తీర్పులు చెబుతుంటాడు 
ఆకాశం ఓర్పుతో సహిస్తుంది 
మనిషి ఆ ఓర్పును సంహరిస్తుంటాడు 
విశాల ఆకాశం రహస్యాలను వెలికితీయమంటుంది 
కుంచించుకుపోతూ మనిషి మకిలితో 
లేకిగా ఉంటాడు

-సి.యస్.రాంబాబు

Comments