నీలాగే నేనుంటే 

Comments · 204 Views

శీర్షిక-ఓ భగవంతుడా -వెంకట భానుప్రసాద్ చలసాని

నీలాగే నేనుంటే 

శీర్షిక: ఓ భగవంతుడా

ఓ భగవంతుడా 
నీలాగే నేనుంటే
మంచివారికి మంచే చేస్తా.
అందర్నీ సమానంగా ప్రేమిస్తా.
పేదరికం అనేది లేకుండా చేస్తా.
అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తా.
పిల్లలందరికీ చదువు అందిస్తా.
ఇలలో దుష్టత్వం  నిర్మూలిస్తా.
మనిషిని మనిషిగా మార్చేస్తా.
అకాల మృత్యువును హరిస్తా.
ప్రజల మనసును మార్చేస్తా.
మంచి సమాజాన్ని సృష్టిస్తా.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Comments