రాలుతున్న గులాబీలు
అమరుల రక్తంతో తడిసి ఎదిగింది గులాబీ వనం..
వికసించిన గులాబీల చూసి పెంచిన ‘కలువ‘లో ఉప్పొంగె ఆనందం..
ఆ గులాబీల గుభాళింపు సోయగాల మత్తులో మైమరిచే సమస్తం..
మమకారం అహంకారమై తలకెక్కిన తన్మయత్వం..
ఆ అహం భూమ్యాకాశాలను ఒక్కటి చేస్తే మిగిలేది పాతాళం..
అదే జరిగింది... గులాబీలు ఒక్కొక్కటిగా రాలుతున్నాయి...
కరిగే కాలంలో గులాబీల సోయగం కానుందా ఘనమైన గతం...
అయినా తగ్గలేదు మళ్లిమళ్లీ వికసిస్తాయనే మితిమీరిన విశ్వాసం...
రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే అంటున్నా వినిపించుకోరేమి పాపం..
-జంగిటి వెంకటేష్, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఉపాధ్యక్షుడు