స్వర్గమేముంది... ఇంతకంటే...

Comentários · 196 Visualizações

స్వర్గమేముంది... ఇంతకంటే... -అల్లావుద్దీన్ 

స్వర్గమేముంది... ఇంతకంటే...

ఇంతకంటే
స్వర్గమేముంది
మదిలో దేవుని స్పర్శ
కంటికి
విందయిన....పసందయిన...
ఎర్ర మందారం...
ఎదురుగా
రాత్ కీ రాణి
గుబురు పొద 
పూల సువాసనలతో
హృదయ పులకరింత
పక్కనే....
సదా బహార్
ఎల్లప్పుడు...
వెన్నంటే ఉంటానని
స్నేహ పలకరింపు
ఆకాశ వీధి నుండి
బహుమతి గా
బహుదూరపు బాటసారి 
వరుణుని
పదాలు అవసరం లేని 
పెదవి దాటని
చిరునవ్వుల 
చిరు జల్లుల
చిలకరింపుల 
పలకరింపులు 
అందుకున్న
చిట్టి పక్షుల
స్వాగతం పలికే 
చీ... చీ... కుహ్... కుహ్
అంటూ 
అందుకే...
ఇంతకంటే
భువిలో....
మదిలో....
ఇంతకంటే 
స్వర్గమేముంది...

-అల్లావుద్దీన్ 

Comentários