భవుడవై -సి.యస్.రాంబాబు

Comments · 274 Views

భవుడవై -సి.యస్.రాంబాబు

భవుడవై

ఎక్కడో వెలుగు రేఖ 
పొడసూపుతుంటుంది
కళ్ళుండీ చూడలేని మనం
నిర్భాగ్యులమై నీరసిస్తుంటాం!

నీడ వెక్కిరిస్తుంది 
మనసు రిక్కిరిస్తుంటుంది
మారే క్షణాలు దొరుకుతాయేమోనని 
మౌనం ఘనీభవిస్తుంటుంది !

గతకీర్తుల భుజకీర్తులొదిలి
అన్నార్తుల ఆకలిచూశావో
వెలుగు నీలోంచే ఉద్భవించగా
భవుడవై చరిత రాస్తావు!

-సి.యస్.రాంబాబు

Comments