నక్కలా దొంగ చూపులు

Comments · 197 Views

నక్కలా దొంగ చూపులు, అవకాశం -మాధవి కాళ్ల..

నక్కలా దొంగ చూపులు

 

 

నీకు కావాలి అవకాశం 
ఏదైనా చేయడానికి దొరకాలి అవకాశం 
ఇతరులను నాశనం చేయడానికి కూడా కావాలి నీకు అవకాశం
మరి నీ భవిష్యత్తు కోసం ఎప్పుడూ అవకాశాన్ని వెతుక్కుంటావో 
నీ మూర్ఖత్వంతో అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లిన 
ఏదో ఒక రోజు అన్ని చుట్టుముట్టి నిన్ను ఆ పద్మవ్యూహంలో బంధించేస్తాయి... 
నీకెందుకు స్వార్థం తప్పు చేస్తే ఎదిరిస్తే పెంచుకుంటారు పగ 
ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఉండరు 
కానీ వాళ్ళ తప్పులను సరిదిద్దుకొని మంచి మార్గాన్ని ఎంచుకునే వాళ్లకే
వద్దన్నా అవకాశాలు వస్తూనే ఉంటాయి 
ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని నుండి తప్పించుకోవడానికి మరెన్నో చెప్తూ 
ఏదో ఒక రోజు ఆ నిజాలు అందరికీ తెలిసి నిన్ను అసహ్యించుకుంటే నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించావా!
అవి ఆలోచించే పరిస్థితుల్లో నువ్వు లేకపోయినా 
ఎదుటివాడు నీకంటే ముందుగానే ఎదిగిపోతున్నాడు 
సరేనా అవకాశం కోసం ఎదురుచూస్తూ నక్కలా దొంగ చూపులు చూస్తూ 
ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తూ 
నీకు మనశ్శాంతి లేకుండా చేసుకుంటూ 
ఎందుకు వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంటూ 
నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు...
ఇది ఎప్పుడు తెలుసుకొని బ్రతుకుతావు...
కొన్నిసార్లు నువ్వు చెయ్యని తప్పుకు కూడా నిందిస్తున్న 
నువ్వు చెయ్యని తప్పులకు శిక్ష అనుభవిస్తున్న 
ఏదో మంచి అవకాశం కోసమే అని గుర్తుంచుకో...

-మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Comments