అగ్గిపిడుగు అల్లూరి

Comments · 182 Views

అగ్గిపిడుగు అల్లూరి -భవ్యచారు

అగ్గిపిడుగు అల్లూరి

ఎవడురా నా భారత జాతిని కప్పమడిగిన తుచ్చుడు అంటూ,కప్పమెందుకు కట్టాలి, పంట ఎందుకివ్వాలి, నారు పోశావా,నీరు పోశావా అంటూ ప్రశ్నించిన మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.

 ప్రశ్నలతోనే కాకుండా, దాడులు చేస్తూ,బ్రిటిషర్ల గుండెల్లో వణుకు పుట్టించిన యోధుడు,ధీరుడు మన అల్లూరి సీతారామరాజు జయంతి నేడు.

*ప్రారంభం*

భారతదేశం స్వేచ్చా,స్వాతత్ర్యం కోసం పోరాడిన య్వరిలో అల్లూరి ముందుగా నిలుస్తారు.మన్యం వీరుడు,అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు ,మన్యం ప్రజల హక్కులకోసం స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ళ చిన్న వయసులోనే ప్రాణాలు విడిచి అమరుడైన విప్లవ జ్యోతి,రెండేళ్ళ పాటు బ్రిటిషర్ల కూ కంటిమీద కునుకు లేకుండా చేసిన సీతారామరాజు తనను నమ్ముకున్న ప్రజల కోసం తన ప్రాణాలు త్యాగం చేశారు.

*జీవితం*

అల్లూరి సీతారామరాజు 1897 జులై 4 న విశాఖపట్నం జిల్లా పాండ్రంగి లో జన్మించారు.అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు లో .రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ,తొమ్మిదవతరగతి వరకు చదివిన అల్లూరి సంసృతం,జ్యోతిష్య శాస్త్రం ,విలువిద్య,గుర్రపుస్వారీ లో ప్రావిణ్యం పొందారు.

 

విప్లవం లోకి...

1917లో విశాఖపట్నం జిల్లా క్రిష్ణదేవి పేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టి,అక్కడున్న ప్రజల దీనావస్థలను చూసి చలించి పోయి బ్రిటిష్ అధికారులకు ఎదురొడ్డి పోరాడారు.బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్దం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పి తానూ సిద్దపడి,తన అనుచరుడు సేనాని గాం,గంటదొర.ఈయనది నడిపాలెం గ్రామం.

అందరు అనుచరులు ,ప్రజలతో కలిసి బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి వెళ్లారు,తొలిగా 1922లో ఆగస్టు 22న చింతపల్లి పోలిస్ స్టేషన్ పై తొలిసారి దాడి చేశారు.23 న కృష్ణదేవి పేట పోలిస్ స్టేషన్,24 న తూర్పుగోదావరి జిల్లా రాజ వొమ్మంగి పోలిస్ స్టేషన్ పై దాడి చేసి ఆయుధాలు తీసుకువెళ్ళారు, అలా చాలా దాడులు జరిపారు.దాడులు చేస్తూ బ్రిటిషర్ల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించారు.

*చివరగా*

అయితే అల్లూరి సీతారామరాజు చేస్తున్న విప్లవాన్ని ఎలాగైనా అణిచి వేయాలని బ్రిటిష్ అధికారులు అనుకున్నారు.దాంతో బ్రిటిష్ ప్రబుత్వం ముమ్మర చర్యలు చేపట్టి చాలా మంది రాజు అనుచరులను చంపివేసింది.మన్యం ప్రజలను చిత్రవధ చేస్తూ అల్లూరి ఎక్కడ ఉన్నాడో చెప్పమని తీవ్ర హింసలకు పాల్పడ్డారు, దీంతో చలించిపోయిన సీతారామరాజు ప్రాణ త్యాగం చేయడానికి సిద్దపడ్డారు.1924 మే 7 న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపాన అల్లూరి సీతారామరాజు స్వయంగా బ్రిటిష్ అధికారులకు లొంగిపోయారు.

సీతారామరాజు పై అప్పటికే పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చి చంపారు,వందేమాతరం అంటూ అల్లూరి తన ప్రాణాలు విడిచారు.

*అంత్యక్రియలు*

మే 8 న రాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని కృష్ణదేవి దేవిపేటకు తీసుకువచ్చి,తాండవనది పక్కన దహన సంస్కారాలు జరిపారు.సీతారామరాజు ఆశించిన, కళలు కన్నా స్వాతంత్ర్యం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు అంటే ఆగస్టు 15,1947 న మనకు వచ్చింది.

బ్రిటిషర్ల గుండెల్లో గుబులు రేపి,వారిపై దాడులు చేసి, ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయననూ తల్చుకోవడం మనందరి బాధ్యత.వారికివే మా ఘనమైన నివాళులు..

-భవ్యచారు   

Comments