పరిగెడదాం వెలుగులోకి

Comments · 243 Views

పరిగెడదాం వెలుగులోకి,-వెంకట భానుప్రసాద్ చలసాని

పరిగెడదాం వెలుగులోకి

 

చీకట్లు కమ్ముకున్నాయని
బాధపడకురా ఓ నేస్తమా
చీకట్లోనే ఉండిపోతే నీకు
ఏమీ లాభంలేదు మిత్రమా
సూర్యోదయం అవుతోంది
వెలుగులోకి రా నాతోటే
పద పరిగెడదాం వెలుగులోకి
నవ సమాజం ఆహ్వానిస్తోంది
స్వేచ్ఛా వాయువులు పీల్చుకో
భయాన్ని వదిలేసి వచ్చేసెయ్
ధైర్యాన్ని నీ తోడుగా చేసేసుకో
వెలుగు నీడలు కావడి కుండలు
అనే విషయం మరువకు నేస్తం
చీకట్లు ఎల్లకాలం ఉండిపోవు
కాంతి రేఖలు ఆహ్వానిస్తుంటే
పద పరిగెడదాం వెలుగులోకి

-వెంకట భానుప్రసాద్ చలసాని

Comments