ఎదురుచూపు

Comments · 284 Views

ఎదురుచూపు-వెంకట భానుప్రసాద్ చలసాని

ఎదురుచూపు

మాటిచ్చి పోయాడు మళ్ళీ
తొందరగా తిరిగి వస్తానని.
పడవెక్కి పోయాడు పట్నంలో
ఏదో ఒకటి సాధించి వస్తానని.
వెళ్ళిపోయిన నాటినుంచి తిరిగి ఏ కబురు పంపలేదు.
నేను ఫోను చేస్తే కూడా
ఫోను ఎత్తకుండా ఉన్నాడు.
కలిసి మెలసి తిరిగిన ఆ జ్ఞాపకాలను మరిచాడు.
చేతిలో చెయ్య వేసి చేసిన బాసలన్నీ కూడా మరిచాడు.
ఉద్యోగం సాధించి ఆ తర్వాత
పెళ్ళి చేసుకుంటానన్నాడు.
ఎక్కడ ఉన్నాడో నా బావ.
ఏమి చేస్తున్నాడో నా వాడు.
తిరిగి వస్తానని రాకున్నాడు.
బావ వస్తాడని ఆశపడుతూ ప్రతిరోజూ పడవ రాకకోసం ఎదురుచూస్తున్నాను.
బావ రాకపోతే?
రాడేమో మరి.

వెంకట భానుప్రసాద్ చలసాని

Comments