ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం నేడు

Comments · 276 Views

ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం నేడు

ప్రపంచ  కాగితపు సంచుల దినోత్సవం నేడు 

 

మీకు తెలుసా ?

మనం ప్రతిరోజు పువ్వులు కొనడానికి వెళ్ళినా, పాలు కొనడానికి వెళ్ళినా,కూరగాయలు కొనడానికి వెళ్ళినా,ఏ వస్తువు కొనడానికి వెళ్ళినా కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఇస్తారు.మనం కూడా అలాగే కవర్లో తెచ్చుకుని తింటాం,వాడతాం,ఇలా ప్రతి సందర్భంలోనూ కవర్ అనేది అనివార్యమయింది.

కాని కవర్ రాకముందు లాలిపాప్ పేపర్లలో పప్పులు,ఉప్పులు,సామాన్లు కట్టి ఇచ్చేవారు.అంటే పేపర్ తో చేసిన కవర్లు అన్నమాట, ఈ పేపర్ కవర్లలో కట్టి ఇచ్చిన సంగతి 1990 అంతకు ముందు వారికీ తెలిసి ఉండొచ్చు,

పేపర్ కవర్ల స్థానంలో ప్లాస్టిక్ కవర్లు వచ్చాయి,ఎందుకంటే వీటిని పట్టుకోవడం తేలిక, అలాగే ఇవి చిరిగిపోకుండా ఎన్ని రోజులైనా ఉంటాయి. కాబట్టి ప్రజలు వీటివైపు మొగ్గు చూపడం తో పేపర్ కవర్లు అంటే న్యూస్ పేపర్ తో చేసిన కవర్లను మెల్లిమెల్లిగా మర్చిపోయారు.

ఈ పేపర్ కవర్లను తయారు చేయడానికి ఇదొక కుటీర పరిశ్రమలాగా గృహిణులు చేసేవారు, ఒకటి చేస్తే రూపాయి ఇచ్చేవారు. భర్త, పిల్లలు వెళ్ళిపోయాక గృహిణులు ఇదొక పనిగా పెట్టుకుని భర్తకు చేదోడు వాదోడుగా నిలిచేవారు, చిన్న, చిన్న అవసరాలకు ఆ డబ్బు పనికి వచ్చేది.ఈ విషయం మన ముందుతరం గృహిణులకు బాగా గుర్తుండే ఉంటుంది.

ఆ తర్వాత ఎప్పుడైతే ప్లాస్టిక్ కవర్ల వాడకం మొదలైందో ఈ కవర్లు,వ్యాపారం కూడా మూలన పడ్డాయి.

కానీ పేపర్లు కొని,దానిని కవర్లు చేసి అమ్మడం తగ్గిపోయింది.పేపర్ కవర్ల ద్వారా కొంత నష్టం ఉంది, పప్పులు,చక్కేరలంటివి తీసుకు వెళ్ళేటప్పుడు అవి పగిలిపోతూ ఉండేవి, దాంతో ప్రజలు ప్లాస్టిక్ కవర్ల వైపు మొగ్గు చూపారు.

కానీ తాము ప్లాస్టిక్ కవర్ల ద్వారా పర్యావరణానికి,తమ ఆరోగ్యానికి ఎంత నష్టం చేసుకుంటున్నామో అనే విషయం మర్చిపోయారు.కొన్నాళ్ళ తర్వాత ప్లాస్టిక్ కవర్లు హాని చేస్తాయి అనగానే మళ్ళి పేపర్ కవర్లు వాడటం మొదలు పెట్టారు.

ఆ తర్వాత జూట్ బ్యాగ్ లతో పాటు రకరకాల బ్యాగ్ లు తాయారు చేసి అమ్మడం , వాటివైపు ప్రజలు మొగ్గు చూపినా, అవి ధర ఎక్కువ కావడంతో, పేద, మధ్యతరగతి వాళ్ళు కవర్లను వాడడం మళ్ళి మొదలు పెట్టారు. ముందే చెప్పినట్లుగా ఇవి వాడటం తేలిక, వాడిన తర్వాత చెత్త వేయడానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశ్యంతో కూడా ప్రజలు వీటిని వాడుతున్నారు.దాంతో పేపర్ బ్యాగు అనేది కనుమరుగైపోయింది.

కాని ప్లాస్టిక్ బ్యాగ్ ల వినియోగం పెరుగుతున్న కొద్ది పర్యావరణం పై కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జులై 12 ని ప్రపంచా పేపర్ బ్యాగ్ డే దినోత్సవం గా జరుపుకుంటాం.

ప్లాస్టిక్ బ్యాగ్ ల వలన ఎంత ముప్పో చెప్తి కాగితపు సంచుల వాడకం పై మనమందరం భాగస్వాములం అవ్వాలి.ప్లాస్టిక్ భూమిలో నశించటానికి కొన్నేళ్ళు పడుతుంది.కానీ కాగితం మాత్రం నీళ్ళలో వేస్తె అలా కరిగిపోతుంది.కాగితం వలన ప్రకృతికి చాలా లాభాలున్నాయి,అవి భూమిని శుద్ధి చేస్తాయి,అలాగే టాక్సిన్ లేకుండా ఉంటాయి.

గాలిలో ఎటువంటి విషపూరిత వాయువులను విడుదల చేయవు.అందుకే కాగితపు సంచులు మానవులకు,జీవాలకు, పర్యావరణానికి అనుకూలమైనవి. ఇది 1852లో ప్రాన్సిస్ వొల్లె చేత మొదటి పేపర్ బ్యాగ్ మెషిన్ నూ కనుగొన్నందుకు గానూ ప్రపంచ పేపర్ బ్యాగ్ డే నూ జరుపుకుంటారు.కానీ అంతకు ముందే మనదేశంలో మొదట్లో వస్త్రాలలో సరుకులు ఇచ్చినా తర్వాత కొన్నాళ్ళకు కాగితపు సంచుల్లో సరుకులు ఇచ్చేవారు.

*లాభాలు*

 కాగితపు సంచులు వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని, ముందుగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అలాగే గాలిని కలుషితం అవ్వకుండా జాగ్రత్త పడొచ్చు,కాగితపు సంచులను రీ సైకిల్ చేయవచ్చు,వీటిని ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు,ఇవి తయారు చేయడం చాలా తేలిక,అలాగే ఉపాధి కూడా లభిస్తుంది.వీటిని కంపోస్టింగ్ ఎరువుగా కూడా వాడుకోవచ్చు.

నేడు కాగితపు సంచుల దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి,కాగితపు సంచులను మనమే తయారుచేసుకోవచ్చు కాస్త కస్తపడితే దీనినే జీవనాధారం కూడా చేసుకోవచ్చు, కాబట్టి ఒక్కసారి ఆలోచించడి,ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని,గాలిని కలుషితం చేద్దామా,లేదా కాగితపు సంచులు వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా అనేది మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా తర్వాత ఇది మనకు అలవాటు అవుతుంది.

ఇప్పటికే చాలా మంది ప్లాస్టిక్ వదిలి జూట్ బ్యాగ్ లను వాడుతున్నారు,అలాగే కాగితంతో చేసిన సంచులను కూడా వాడుతున్నారు, కానీ జూట్ బ్యాగ్ లు అవి కూడా మంచివే, కానీ అందరికి కొనే శక్తి ఉండదు. కాబట్టి కాగితపు సంచులు మీరే ఇంట్లోనే తయారుచేసుకుని భూమిని,గాలిని, మిమల్ని మీరు రక్షించుకోండి.కాగితపు సంచుల విలువను గుర్తించండి.

ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవ శుభాకాంక్షలు  

-భవ్యచారు 

Comments