తపాలా పెట్టే
"అమ్మ... మీ దూరపు బంధువులు ఎవరో చనిపోయారని వాట్సప్ గ్రూపులో ఫోటో పెట్టారమ్మా" అని చెప్పింది రాధ.
"ఏది... ఒకసారి ఫోటో చూపించమ్మా" అని అడిగింది శకుంతల.గ్రూపులో ఉన్న ఫోటో తీసి శకుంతలకి చూపించండి రాధ.
"అవును... వీళ్ళు మా నాన్నకి దూరపు బంధువులే. నాకు వరసకు అన్నయ్య అవుతారు" అని చెప్పింది శకుంతల.
"ఏంటమ్మా... ఎవరో చనిపోయారు అంటున్నారు ఎవరు?" అని అడిగింది పక్కింటి బామ్మ గారు.
"మా నాన్నకి దూర బంధువైన మా పెదనాన్న గారి కొడుకు చనిపోయారు" అని చెప్పింది శకుంతల.
"
అయ్యో రామ... ఇది ఎప్పుడు జరిగింది అమ్మాయి?" అని అడిగింది బామ్మ గారు."ఈరోజు తెల్లారి జామున చనిపోయారు బామ్మ గారు" అని చెప్పింది రాధ.
అవునా... అప్పుడే ఎలా తెలిసింది అమ్మాయి మీకు?" అని అడిగింది బామ్మ గారు.
"ఇప్పుడు కాలం మారింది బామ్మగారు. ఈ ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ద్వారా అన్ని తెలిసిపోతాయి బామ్మ గారు" అని చెప్పింది రాధ.
"మా కాలంలో అయితే ఇలాంటి విషయాలు ఉత్తరాల ద్వారా తెలిసేది మాకు. సంతోషమేనా బాధాకరమైన విషయాలైనా ఇలా ఉత్తరాలు రాసే పంపించుకునే వాళ్ళం. ఆ ఉత్తరాలు వచ్చినప్పుడు రెండు మూడు రోజులు పట్టేది" అని చెప్పింది బామ్మ గారు.
"అవును బామ్మ మేము కూడా చదువుకునేటప్పుడు ఉత్తరాలు పంపుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రపంచం మారింది , టెక్నాలజీ మారింది" అని చెప్పింది రాధ.
"అయినా ఈనాటి తరానికి పాతకాలపు విషయాలు అసలు తెలియవు. చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఎక్కడో ఒకచోట ఉన్నారు అంతే తప్ప ప్రపంచం , టెక్నాలజీ మారిన ఉత్తరాలు రాసుకోవడం మర్చిపోయారు. త
పాలా పెట్టెలు ఇప్పుడు చూసిన కూడా అదే ఒక మూలన పడి ఉంటుంది అంతే.మన అనుకున్న వాళ్ళ దగ్గర నుండి ఉత్తరం వస్తే ఆనందం మాటల్లో చెప్పలేనిది. మనం దానికి సమాధానంగా ఉత్తరం రాసి పంపిస్తే ఆ ఉత్తరం కోసం ప్రతి రోజు ఎదురుచూపులే.
ఇప్పటిలాగా వాట్సప్,ఫేస్బుక్ లో ఏ విషయమైనా చిటికెలో తెలుసుకోవడం చాలా సులువుగా అనిపిస్తున్నా , అప్పటి ఎదురుచూపులో కష్టంలో కొంచెం కష్టంగా ఉన్న మరి కొంచెం బాధ ఉన్నాయి. మన మనసులో ఉన్న మాటలు రాసి పంపిస్తే మనకు అదొక తృప్తి కలుగుతుంది" అని చెప్పింది బామ్మ గారు.
"మీరు చెప్పింది అక్షర సత్యం కానీ ఇప్పటి పిల్లలు ఫోన్ లో కూడా చదువుకుంటున్నారు. ఏదైనా రాయాలి అంటే ఫోన్లో టైప్ చేస్తున్నారు కానీ కలం , కాగితం వాడడం లేదు" అని చెప్పింది శకుంతల.
"ఏ కాలమైనా సరే మనుషుల అనుబంధాలు నిలబెట్టుకోవాలి కానీ విడగొట్టుకోకూడదు. మనుషులు మధ్యనే ఉంటూ ఫోన్లు వాడుతున్నారు ఇప్పుడు. అదే అప్పుడైతే అందరూ కలిసి భోజనం చేసేవాళ్లు.
కలిసి మాట్లాడుకునే వాళ్ళు.
అప్పటి కాలంలో ఫోను లేకపోయినా ఎప్పుడో ఒక కబురు మనిషి కనిపించేవాళ్లు అంతే" అని చెప్పింది బామ్మ గారు.
"ఉత్తరాలు కూడా మంచి చెడు అయినా మన వాళ్ళతో పంచుకోవాలని పంపుకునే వాళ్ళం.
దగ్గరుండి ఓదార్పు ఇవ్వకపోయినా ఒక ఉత్తరంతో ఆ మనిషి మన పక్కనే ఉన్నట్టు చదువుతూ ఉంటే మనకు ఓదార్పుగా అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పింది శకుంతల.
"అలాంటి తపాలా పెట్టెలు ఇప్పుడు ఒక మూలన కనిపిస్తున్నాయి అంటే చాలా బాధాకరంగా ఉంది" అని చెప్పింది బామ్మ గారు.
"ఉత్తరాల గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు మీరు. ఉత్తరాలు రాసుకుంటే చెరిగిపోని అక్షరాలు. అలాంటి ఉత్తరాలు ఎన్నిసార్లు చదువుకున్న తెలియని అనుభూతికి లోనవుతాము అని మీ మాటల్లోనే నాకు అర్థమైంది" అని చెప్పింది రాధ.
కొన్నాళ్ల క్రితం తన ఫ్రెండు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు చాలా బాధగా అనిపించింది రాధాకి. తన స్నేహితురాలికి ఫోన్ చేసి మాట్లాడిన తనివి తీరలేదు. తనకి ఉత్తరం రాసి పంపించాలనుకుంది.
రెండు రోజుల తర్వాత తన స్నేహితురాలికి ఉత్తరం రాసి పంపించింది.తన స్నేహితురాలు కూడా ఉత్తరం చదివి రాధకి కూడా ఉత్తరం రాసి పంపించింది.
నీ క్షేమం కోసం రాశాను ఈ ఉత్తరం
నీ సమాధానం కోసం వేయికళ్లతో చూస్తున్నాను
నా మనసులో మాట నీతో పంచుకున్నందుకు
నాలో తెలియని అనుభూతికి మాటల్లేవు
పాత రోజుల్ని గుర్తు చేశావు నాకు
ఈ ఉత్తరం ఒక జ్ఞాపకం గా
నా జీవితంలో మిగిలిపోతుంది...
ఓ నా అల్లరి స్నేహితురాలా
నీ చిలిపి మాటలు చదువుతూ ఉంటే
గుర్తుకొస్తున్నాయి ఆ పాత రోజులు..
అని కవిత రాసి రాధకి పంపించింది తన స్నేహితురాలు.
-మాధవి కాళ్ల