సరస్వతి కటాక్షం
'"చదవడానికి ఎందుకురా తొందర?
ఎదర బతుకంతా చిందర వందర,
అన్న వాక్యాలు అక్షర సత్యాలు.!!
'విద్యారంగం లో ఎన్ని లోటుపాట్లు జరిగిన,
ఉపాధ్యాయులు సవరించడానికి కూడా వీలు లేని పరిస్థితి,
''రెండున్నర సంవత్సర వయసులోనే,
బాలులను బలవంతంగా, ' 'క్రెచ్ లోకి '
'పంపించి, తల్లిదండ్రులు, ధనార్జన కోసం,
అమూల్యమైన బాల్యాన్ని హరించే విధానమే మారాలి.!!
''కౌమార దశ లో, అంతర్జాల' పాఠ్యాంశాలకు అలవాటు పడి,
బాలురు తమ స్వశక్తిని కోల్పోయి,
'ఉపాధ్యాయులు చెప్తున్న పాఠాలను కూడా పెడచెవిని పెట్టి ,,
నిముషంలో జవాబులు చెప్పే ' చరవాణి ' ఆశ్రయం తో,
'గూగులమ్మ,'తల్లికి అలవాటుపడి, పరీక్షలు రాయడంతో,
,భగవంతుడు ఇచ్చిన తెలివితేటలనుమరిచిపోయి,
నిర్లక్ష్య ధోరణితో, బ్రతుకును నాశనం చేసుకుంటున్నారు.
"ఓ యువతీ యువకుల్లారా, బాలబాలికల్లారా,!
ఉపాధ్యాయులు బోధిస్తున్నపాఠాలను,తమస్వశక్తితో
అర్థం చేసుకుని ,అత్యవసర పరిస్థితులలోనే,
అధునాతన పోకడ లైన, చరవాణి లను ఉపయోగించండి,
'విద్యా విధానాలను, ఉపాధ్యాయులను,
తల్లిదండ్రులతో పాటు గా గౌరవించిన నాడే'
చదువుల తల్లి ,"సరస్వతీ కటాక్షం" లభించునని,
విద్యార్థినీ విద్యార్థులకు, నా మనవి.!!!"
"మా తెలుగు తల్లికి మంగళారతులు"!!!
-వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు