కుదురుకునే కల

Comments · 533 Views

కుదురుకునే కల- సి.యస్.రాంబాబు

కుదురుకునే కల

కలలు,నక్షత్రాలు
చేతికందితే కోసుకోవాలనుంటుంది
తోసుకొచ్చే కాలాన్ని నిలవరించాలనుంటుంది
సాధ్యం కాని విషయాలను
సాధించాలనుకోవటం తప్పుకాదు
ఆ తపన లేకపోవటం తప్పు

వేడి వేడి కాఫీని చప్పరించినట్టు
మనసును చప్పరిద్దాం
మహిమలు కురవకపోయినా
కుదురుకునే ఆలోచనలు పిల్లగాలిలా వీస్తుంటే
పిల్లాడైపోవచ్చు
ఆనందాల తలుపు తెరవొచ్చు
కుదురుకుంటూ కలొకటి కిసుక్కున నవ్వింది

- సి.యస్.రాంబాబు

Comments
Venkata Bhanu prasad Chalasani 36 w

చక్కటి కాఫీలాంటి రచన.