గిడుగు
గిడుగు వారు పట్టే తెలుగు తల్లికి గొడుగు .
తరతరాలకు శోభ సంతరించుకొనుగా
తెలుగు భాష నిత్య వెలుగుల మల్లెలై పరిమళించగా.
తెలుగు అక్షరమాల వల్లె వేయగా
సరళ భాషలో సామాన్యులకు
అందుబాటులో అందివ్వగా
అహర్నిశలు కృషి చేసే గిడుగు .
అందరూ వల్లే వెయ్యటానికి వీలుగా
వడివడిగా సరిగమలు పలుకు
తెలుగు తల్లి భాష మాధుర్యాన్ని
శిఖరాగ్రాన ఉంచగా ఎన్నో వెయప్రయాసలు పడే గిడుగు ..
వాడుక భాషా పున్నమలు తెలుగు లోగిళ్ళలో
పరచగా వచ్చిన పున్నమి చంద్రుడు గిడుగు ..
ఎన్నోఅమావాస్యలు తన జీవితంలో అలముకున్నా
ఒకరి తరువాత ఒకరు దెబ్బతీయాలని
పెట్టే ఇబ్బందిని తట్టుకుంటూ
తను అనుకున్న పందాన్ని
వీడక ఎన్నో ఉద్యమాలతో
వాడుక భాష వన్నె పెంచె గిడుగు.
ఎంతోమందిని చైతన్యం చేశారు.
అది మింగుడు పడని గ్రాధిక
భాషావాదులు ఎదురు తిరిగి
దాడి చేసినా బయపడక
తన సంకల్పాన్ని ఏ మాత్రం
తొణక నీయ్యక వాడుక బాషా ప్రచుర్యాన్ని
పెంచుతూ తన ఉద్యోగాన్ని కూడా
త్యాగం చేసి ఉద్యమాన్ని నడిపించారు గిడుగు ..
అంతేకాకుండా సవరలకు కూడ
విద్య అవసరమని సవర భాషనేర్చి,
నేర్పించారు తన ఇంట .
ఆ సవర భాష నేర్చుకునే క్రమంలో ఆరోగ్యం పాడై
వినికిడి శక్తి సన్నగిల్లినా వదలక
ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి గిడుగు.
తెలుగు తల్లికి ముద్దుబిడ్డ .
మన అందరికి వాడుక భాషా ప్రదాత
జ్ఞాన పితామహుడు గురువర్యులు .
వారికి నా శిరస్సాభి వందనాలు
గిడుగు రాంమోనరావు మాష్టారి
జయంతి సందర్భంగా వారికోసం
నా తెలుగు కవిత ..
అనురాగ వల్లి తెలుగు తల్లి .
సెలయేటి వంపుసొంపుల లావణ్య జాక్షి మన తెలుగు
రంగురంగుల ఇంద్రధనుస్సు వన్నెల అందం మన తెలుగు.
అగరు పొగరుల ధూప గుభాళింపు మన తెలుగు ..
చీకటి చిదిమి వెలుగులు నింపే జ్ఞాన దీపిక మన తెలుగు.
ప్రకృతి మురిసి విరిసిన సుమ పరిమళం మన తెలుగు ..
లేగదూడ ఆనంద చిందుల విన్యాసమే మన తెలుగు ..
పవనుడు అలలపై మోసే సుమగంధమే మన తెలుగు.
ఝుంటి తేనియల మకరందమే మన తెలుగు.
కమ్మగా పండిన మధుర మామడి పండు మన తెలుగు.
చిలికి తీసిన వెన్నలాంటి లాలిత్యం మన తెలుగు .
ఎందరో కవులను కీర్తి శిఖరం ఎక్కించిన ఘనతే మన తెలుగు.
అన్ని భాషలకన్నా మిన్నైన మన తెలుగు .
తర్కంలోను , చమత్కారంలోను ,
ప్రాస కవితలలోను ,సరిగంగ మన తెలుగు...
శతక పద్యములలోను ,కవన పరంపరలోను
మధురమై విరాజిల్లెను మన తెలుగు ...
గజల్ గమకాలలోను , అవధానాల సరళిలోను
అలరారుతోంది సింధూరమై మన తెలుగు ...
అన్నమయ్య ఆలాపనా ఆద్యాంతం పతిధ్వనించే మన తెలుగు ..
పద్య , గద్యా రచనలలో గండపెండేరమే మన తెలుగు ....
ఎకసెకాల సరసపు చిలిపితనమే మన తెలుగు ...
నవ్యకాంతుల భవ్యాలోచనల భావి భారతం మన తెలుగు ..
ఎందరెందరో కవీంద్రులు తెలుగు తల్లి పాద
పూజలో తరించి చిరంజీవులై
హృదయాలలో నెలకొన్నారు అక్షరంగా .
ఎప్పుడూ వెలగాలి ఉషోదయంలా
తెలుగుభాషఅనుదినంఅక్షరపూజలో
నవ్య కాంతుల రాజసంలా తూగుతుంది
మన తెలుగు దిగంతాలలో ..
మమతగా మనం పొదివి పట్టుకుంటే .
మన పిల్లల హృదయాలలో నింపుతుంటే ..
గిడుగు వారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు..
-ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి