సంఘర్షణ ఏడో భాగం
కొన్ని బంధాలను వద్దు అనుకున్నా అవి మనతోనే వస్తాయి. కొందర్ని ఎంత వదిలించుకోవాలని చూసినా వదిలించుకొని వెళ్ళలేము. అలాంటి బంధాలు ఎంతో ముడి పడతాయి. ఏ బంధం ఎప్పుడు ముడి పడినా దాన్ని కాపాడుకోవడం లోనే మన జీవితం దాగుంది.
*******
కరుణ పరుగెత్తి పరుగెత్తి ఒక ఇటుక బట్టి వెనకాల దాక్కుంది. గోడ చాటుకు నుండి చూస్తూ వీళ్ళ దుంపలు తెగ నా వెనకాల పడ్డారు వెధవలు ఇంకా వస్తున్నారా అంటూ దిక్కులు చూస్తూ ఇది ఎక్కడికి వెళ్లిందో అనుకుంటూ తానెక్కడ ఉన్నది చుట్టూ చూడసాగింది.
ఇంతలో వెనక నుండి ఒక చెయ్యి వచ్చి కరుణ భుజం పై పడింది.
కెవ్వున కేక వేసి ఇక నా పని అయిపోయింది వారి చేతిలో పడ్డాను.నా జీవితం ఇక అంతం అయ్యింది అనుకుంటూ సొమ్మ సిల్లీ పడిపోయింది కరుణ.
తోటకూర కాడలా వాలిపోతున్నారు కరుణ ను పట్టుకుంటూ అయోమయానికి గురి అయ్యాడు అరుణ్ .
ఏరా ఇలా వాలిపోయింది ఏంటి అంటూ అనిల్ నీ అడిగాడు.ఏమో నాకేం తెలుసు నేను నీతోనే గదా వచ్చింది.నన్ను అడుగుతావెంటి అంటూ చిరాకు పడ్డాడు అనిల్.
ఏయ్ కరుణ కరుణ అంటూ తనను తట్టి లేపే ప్రయత్నం చేయసాగింది స్నేహితురాలు . అమ్మ తల్లి తాను ఇప్పుడప్పుడే లేచెల లేదు కానీ నువ్వు నిద్రలేపి ప్రయత్నం చేయకు అంటూ అనిల్ తనని వారించాడు. అరుణ్ అనిల్ తో ఒరేయ్ తాను లేవక పోతే ఎలారా తీసుకుని వెళ్ళేది అంటూ అడిగాడు. రేయ్ దేవుడు నీకు భుజాలు ఎందుకు ఇచ్చాడు రా అంటూ అడిగాడు అనిల్ భుజాలు ఎందుకు ఇస్తాడు రా దేవుడు ఆ మూటలు మోయడానికి అంటూ ఎటకారం గా అన్నాడు అరుణ్.
చల్లచాలే నీ ఎదవ ఎటకారం అపి, తనను భుజాల పై ఎత్తుకుని పద అన్నాడు అనిల్ . నేనా వామ్మో చస్తానేమో రా అన్నాడు బరువు నీ తల్చుకుంటూ. పెద్ద బాడి బిల్డర్ ఆ మాత్రానికే చస్తార ఎంటి మీ అబ్బాయిలు మరి ఇంత సున్నితమైన వారా అంటూ కరుణ స్నేహితురాలు నోటి పై చేయి వేసుకుంటూ నవ్వు ఆపుతూ అడిగింది.
ఒరేయి అరుణ్ అబ్బాయిల ఇజ్జత్ కా సవాల్ రా నవ్వుతున్నారు ఆ నవ్వును ఆపాలి అంటే నువ్వు ఈ పని చేయక తప్పదు రా మన విలువ ఏంటో తెలియాల్సిన సమయం వచ్చింది అంటూ ఎంకరేజ్ చేశాడు అనిల్.అంతే అంటావా అంటూ అడిగాడు అరుణ్ అంతే రా అంటూ ఖండితంగా చెప్పాడు అనిల్ సరే నీ కోసం చేస్తా అంటూ కరుణ ను ఒక్కసారిగా ఎత్తి భుజం పై వేసుకున్నాడు. అతని పట్టుదల చూస్తూ కరుణ స్నేహితురాలు ముక్కున వేలేసుకుoది. అది చూసిన అనిల్ ఆశ్చర్య పోవడం తర్వాత పదనిముదు అంటూ అనడంతో వారిని అనుసరించింది.
******
ఏమయ్యా నీకు అప్పు ఉంటే మాత్రం తీసుకొచ్చి ఇలా గొడ్డును కట్టేసినట్టు కట్ల కట్టేస్తావా. కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నువ్వు ఊరు పెద్దమనిషి హోదాలో ఉండి ఇలా చేయడం ఎంతవరకు న్యాయం. ఊరందరికీ ఆదర్శంగా నిలవాలి కానీ ఇలా పిచ్చిపిచ్చి పనులు చేస్తూ పిచ్చివాడివి అయ్యి గొడ్డులా ప్రవర్తిస్తావా అంటూ తన స్నేహితుడి కట్లను విప్పసాగాడు అరుణ్ తండ్రి.
బయటి ఊరు నుండి వచ్చిన ఎవరో ఒకడు తన ఊర్లో తన పరువు తీస్తుంటే తట్టుకోలేకపోయినా మనోహర్ తండ్రి మరీ ఇచ్చిన ఆపు సమయానికి తీర్చాలి కదా అని అన్నాడు భీంకంగా ఎంతుందండి ఆపు ఆపేందో నేను చేస్తాను అన్నాడు అరుణ్ తండ్రి 10 లక్షలు ఇవ్వాలి దానికి ఇంకో ఐదు లక్షలు అంటే మొత్తం 15 లక్షలు ఇవ్వాలి అన్నాడు మనోహర్ వాళ్ళ తండ్రి.
ఆమాత్రానికే మీరు ఇతని ఇలా చేయడం బాగాలేదు ఇదిగోండి బ్లాక్ చెక్ అంటూ జేబులో నుంచి చెక్ బుక్ తీసి సంతకం చేసి చెక్ ఇచ్చేశాడు . మీరు దానిపై 20 లక్షలు రాసుకున్న నాకేం నష్టం లేదు కానీ నా స్నేహితుని ఇలా చేశారు కాబట్టి అంటూ దగ్గరికి వచ్చి అతను చెంప మీద ఒక్క దెబ్బ కొట్టి ఇలాంటివి ఇంకెప్పుడు చేయకండి అంటూ పదరా అని స్నేహితుని మెల్లగా లేపి భుజాలపై చేతులు వేసుకొని తీసుకొని వెళ్లారు.
మనోహర్ అందుకే అలా అవమానం జరగడంతో ఏం చేయాలో తూజకా దిక్కులు చూస్తూ తన పని వాళ్ళను మీకేం పని లేదా అంటూ గదమాయించేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్లిపోయారు. కోపంతో రగిలిపోయాడు మనోహర్ తండ్రి ఇంతలో మనోహర్ కూడా వచ్చి నాన్నగా ఆది దొరకలేదు కానీ దెబ్బలు మాత్రం బాగా తిన్నాం ఎవడో వచ్చి బాగా కొట్టాడు అంటూ చెప్పాడు నీ మొహం నీ మొహానికి ఏది చేతకాలని అర్థమైంది వెంటనే మూట ముళ్ల సాదుకొని ఎత్తేయ్ మనం ఇక్కడ ఉంటే ఇంకా మన పరువు పోతుంది అంటూ పని వాళ్లకు సామాన్లు సర్థమని పురమాయించాడు.
*******
మరోవైపు అరుణ్ కరుణ అనిల్ కరుణ స్నేహితులు అందరూ కారులో కలిసి మీరు ఎక్కడికి వెళ్లాలి అందే అడిగాడు నేను అంటూ తను అడ్రస్ చెప్పింది అన్నాడు అనిల్ అక్కడికే వెళ్లాల్సింది అవును ఇంతకీ మీరు పెళ్లికూతురికి ఏమవుతారు అంటూ అడిగాడు అరుణ్ అయ్యో తనేనండి పెళ్లికూతురు అంటూ చెప్పింది స్నేహితురాలు అవునా అంటూ ఇద్దరూ ఆశ్చర్యపోయి కరుణవైపు బిత్తరపోయి చూశారు.
అరుణ్ కరణం చూసి బానే ఉంది పర్లేదు అందగత్తె అని అనుకున్నాడు మనసులో తరుణ కూడా అరుణ్ చూసి విషయం అర్థమై ఇతనే అబ్బాయా అబ్బా ఎంత బాగున్నాడు అయినా వీడుతో నాకు పెళ్లి ఏంటి చి చి అనుకుంది మనసులో అరుణ్ కూడా సేమ్ ఫీలింగ్ తో చి చి ఎంత బాగున్నావు రా దీంతో నాకు పెళ్లి ఏంటి అని అనుకుంటూ మొహాలు తిప్పేసుకున్నారు అసలు విషయం తెలిసిన ఇద్దరు స్నేహితులు మొహాలు చూసుకొని నవ్వుకున్నారు.
అయితే అనిల్ సిగ్గు కదండి ఇద్దరు వీడియో పడుతున్నారు అంటూ కవర్ చేశాడు. అవునవును కొత్త నే కదా అంటూ తన స్నేహితురాలు కూడా కామ్ గా ఊరుకుంది.
******
చాలా థాంక్స్ రా సమయానికి వచ్చినా బరువు కాపాడావు అండ్ స్నేహితుని కౌగిలించుకున్నాడు కర్ణ తండ్రి మామూలే నువ్వేంటి రా నేను ఏదో పరాయి వాడినైనట్టు నన్ను దూరం చేస్తున్నావు అంటూ మనమిద్దరం స్నేహితులం రా మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనే కదా ఇంత దూరంలో ఇన్నేళ్లయినా కూడా నా కొడుకు పెళ్లి చేయకుండా అలాగే ఉంచాను అంటూ ఇద్దరూ కౌగిలించుకున్నారు వారి స్నేహాన్ని చూసిన వారి భార్యలు ఇద్దరు కళ్ళు తుడుచుకున్నారు.
ఇంతలో అరుణ్ కరుణ నల కారు అక్కడికి వచ్చింది. ఎవరు అందులోంచి దిగుతుంది అని అందరూ ఆశ్చర్యపోతూ చూసారు. అందులోంచి కరుణ ,కరుణ స్నేహితురాలు అలాగే అరుణ్ ,అనిల్ దిగారు. పెద్దల మొహాల్లో చాలా సంతోషం తో కూడిన ఆశ్చర్యం కలిగింది.
ఇప్పటి వరకు చూసుకొని వాళ్ళు కలిసి రావడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. మీరు ఎలా అంటూ తల్లిదండ్రులు అడిగితే అరుణ్ విషయం అంతా చెప్పాడు. దాంతో తండ్రి అబ్బో కాబోయే పెళ్ళాన్ని వాడే కాపాడుకున్నాడు చూశారా అది రా మా వాడు అంటే అంటూ. గొప్పగా చెప్పుకుంటూ చూడండి పెళ్లి అవ్వక ముందే పెళ్ళాన్ని. కాపాడుకున్నాడు అంటే పెళ్లి అయ్యాక ఇంకెంత బాగా చూసుకుంటాడు అంటూ పదండి పదండి ముహూర్తానికి సమయం అవుతుంది అంటూ అందర్నీ బయలు దేరే లా చేశాడు.
తండ్రి మాటలతో షాక్ తిన్న అరుణ్ కరుణ వైపు చిరాగ్గా చూస్తూ ఛీ నా బతుకు పోయేదాన్ని పోనిక హీరో లా కాపాడాను , ఈ అనిల్ గాడు నాన్ను ఇరికించారు మామ అమ్మాయి నీ కాపాడు అంటూ ఎంకరేజ్ చేశాడు ఎరా ఎక్కడున్నావ్ అంటూ అరిచాడు. మామ నాకేం తెలుసు రా అంటూ. కారు వెనకాల దాకున్నాడు అనిల్.
మరోవైపు కరుణ కూడా వీడేనా వీడిన నేను పెళ్లి చేసుకునేది చి చి అనవసరంగా దిరికాను అంటూ స్నేహితురాలి వైపు చూసింది. తను కూడా బిక్క మొహం వేయడం తో నుదురు కొట్టుకుని పద అంటూ ముందుకు వెళ్ళారు ఇక తప్పక.
అరె అరుణ్ పదరా ముహూర్తానికి సమయం అవుతుంది.జరగాల్సింది జరగని తర్వాత నేను చెప్పినట్టు చెద్దువు గానీ అంటూ అరుణ్ నీ కూడా లాక్కుని వెళ్ళాడు.
ఇద్దరికీ ఇష్టం లేకుండానే పెద్దల ఆశీర్వాదం తో సరిగ్గా ముహూర్త సమయానికి అరుణ్ ,కరుణ మెడలో అయిష్టంగా మూడు ముళ్లు వేశాడు. అందరూ చాలా సంతోషించారు.ఆగిపోతుంది అనుకున్నా పెళ్లి అవడం వల్ల అరుణ్ తల్లిదండ్రులు,కరుణ తల్లిదండ్రులు స్నేహం బంధంగా మారడం వల్ల సంతోషంగా నూ ఆనందంగా ఉన్నారు.
కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఇద్దరూ కూడా మనసులో ఉడికి పోతూ ఎలా వదిలించుకోవాలి అని చూస్తున్నారు ఒకరి వైపు ఒకరు కోపంగా..
ఇంతకీ వీరి కాపురం సజావుగా సాగుతుందా లేదా అనేది తర్వాతి భాగంలో తెలుసుకోండి. భవ్యచారు.