అర్థం లేని ప్రశ్న

Bình luận · 51 Lượt xem

కనులు తెరిచి తరచి చూచినంత 
   కనుదోయి నవ్వ ప్రయత్నించ 

 కవితలు పోటీ         
      అర్థం లేని ప్రశ్న 
   
   కనులు తెరిచి తరచి చూచినంత 
   కనుదోయి నవ్వ ప్రయత్నించ 

   ఎదురు తిరిగి పలకరించ 
   యద చిన్నబోయె చిరు సిగ్గుతో 

    ఏమిటో నిన్నటి సొబగులు 
    నేడు కత్తుల రూపం దాల్చే 
    మానవీయతలో మానవత్వం 
    లోపమా, మమకార బంధాల 

    విచళిత గుణమా, ఏది మార్పు 
    ఏది చేర్పు, ఎచటికీ సుదీర్ఘ 
    ప్రయాణం, అందనంత దూరమా?
     అందుకోలేని దూరమా? 
 
     అర్థం కాని, అర్థం లేని ప్రశ్న 
      పరంపరలు, చేదామన్నా
      ప్రయత్నం చేజారుతోంది 
      పలుకు బిగుసుకుంది 
   
      మౌనం మరులు పొందే
       చేతలు చచ్చుబడినా
       జీవితం చేరేదెక్కడికి
      అంతులేని ప్రశ్న?....

    ఇది నా స్వీయ రచన అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.....కె.కె.తాయారు

Bình luận